UPSC EPFO Recruitment 2025 Apply Online | EPFOలో 230 ఉద్యోగాలు.. చివరి తేదీ..

UPSC EPFO Recruitment 2025 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 230 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 29వ తేదీ నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఈ తేదీ పొడిగించబడింది.

EPFO Recruitment 2025 Overview: 

నియామక సంస్థయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్గనైజేషన్ – ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)
పోస్టు పేర్లుఎన్ ఫోర్స్మెంట్  ఆఫీసర్ / అకౌంట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్
పోస్టుల సంఖ్య230
దరఖాస్తు ప్రక్రియ29 జూలై – 22 ఆగస్టు, 2025
జాబ్ లొకేషన్ఆల్ ఇండియా

పోస్టుల వివరాలు : 

భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్ ఫోర్స్మెంట్  ఆఫీసర్ / అకౌంట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 230 పోస్టులు కాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీలు
ఎన్ ఫోర్స్మెంట్ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్156
అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్74

విద్యార్హతలు : 

EPFO Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • ఎన్ ఫోర్స్మెంట్ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ : సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ
  • అసిస్టెంట్ ప్రావిడెంట ఫండ్ కమిషనర్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమానం.

వయస్సు : 

EPFO Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. వివరాల కింద ఇవ్వబడ్డాయి. 

  • ఎన్ ఫోర్స్మెంట్ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ : 30 సంవత్సరాలు
  • అసిస్టెంట్ ప్రావిడెంట ఫండ్ కమిషనర్ : 35 సంవత్సరాలు
  • ఎస్సీ / ఎస్టీ : 5 సంవత్సరాలు వయోసడలింపు
  • ఓబీసీ : 3 సంవత్సరాలు వయోసడలింపు

అప్లికేషన్ ఫీజు : 

EPFO Recruitment 2025 జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.25/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ / మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

EPFO Recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

EPFO Recruitment 2025 పోస్టును బట్టి ఎంపికైన అభ్యర్థులకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. 

  • ఎన్ ఫోర్స్మెంట్ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ : పే లెవల్ -8 ప్రకారం రూ.47,600 – రూ.1,51,100/- 
  • అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ : పే లెవల్-10 ప్రకారం రూ.56,100 – రూ.1,77,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

EPFO Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. 

  • అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక పోర్టల్ కి వెళ్లాలి. 
  • హోమ్ పేజీలో ఆన్ లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. 
  • పోస్టును ఎంచుకోవాలి. 
  • వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 29 జూలై, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 22 ఆగస్టు, 2025
NotificationClick here
Apply OnlineClick here

Last Date Extended Notice : Click here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!