UIIC Apprentice Recruitment 2025 | “UIICలో భారీ నోటిఫికేషన్ ! డిగ్రీ ఉన్న వాళ్లకి గోల్డ్ ఛాన్స్!

UIIC Apprentice Recruitment 2025: యునైటెడ్ ఇండియా ఇన్షూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. భారతదేశంలోని ఏ రాష్ట్రానికైనా చెందిన Engineering మరియు Non-Engineering Graduates ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 153 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 2021 జూలై నుంచి 2025 వరకు డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశం. ఆన్ లైన్ అప్లికేషన్లు డిసెంబర్ 18వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు స్వీకరిస్తారు. 

UIIC Apprenticeship 2025 – Overview

  • సంస్థ: United India Insurance Co. Ltd
  • కార్యక్రమం: 1-Year Apprenticeship 
  • మొత్తం ఖాళీలు: 153
  • అర్హత: ఏదైనా Graduation (2021–2025 బ్యాచ్)
  • స్టైపెండ్: ₹9,000 నెలకు
  • అప్లికేషన్ ప్రారంభం: 18-12-2025
  • చివరి తేదీ: 20-01-2026

ఖాళీల వివరాలు

యూనైటెడ్ ఇండియా ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 153 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు కింద ఇవ్వడం జరిగింది. 

  • ఆంధ్రప్రదేశ్ – 3
  • తెలంగాణ – 2
  • తమిళనాడు – 19
  • కర్ణాటక – 26
  • మహారాష్ట్ర – 23
  • రాజస్థాన్ – 18
  • కేరళ – 10
  • మధ్యప్రదేశ్ – 6
  • ఢిల్లీ – 9
  • గుజరాత్ – 8
  • పుదుచ్చేరి – 4
  • ఉత్తరాఖండ్ – 5
  • పశ్చిమ బెంగాల్ – 4
  • చత్తీస్‌గఢ్ – 4
  • పంజాబ్ – 2
  • బీహార్ – 2
  • ఓడిశా – 1
  • జార్ఖండ్ – 1
  • అస్సాం – 1
  • హర్యానా – 1

Also Read : IOCL Non Executive Recruitment 2025 | ఇండియన్ ఆయిల్ లో భారీ నోటిఫికేషన్ – 394 పోస్టులు

అర్హతలు (Eligibility Criteria)

UIIC Apprentice Recruitment 2025 అప్రెంటిస్ షిప్ కి అర్హత పొందడానికి అభ్యర్థులకు కింద అర్హతలు ఉండాలి. 

  • ఏదైనా Full-time Graduation (Engineering / Non-Engineering)
  • Degree 2021 జూలై నుండి 2025 మధ్య పూర్తి అయి ఉండాలి
  • Only AICTE / DOTE / UGC approved institutions నుంచే చెల్లుతుంది

వయోపరిమితి (Age Limit)

UIIC Apprentice Recruitment 2025 అభ్యర్థులకు 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC/ST/OBC/PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక ప్రక్రియ (Selection Process)

UIIC Apprentice Recruitment 2025 UIIC Apprenticeship కోసం ఎలాంటి పరీక్ష లేదు.  కింద ఇచ్చిన ప్రాసెస్ లో సెలక్ష చేస్తారు. 

 1. గ్రాడ్యుయేషన్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్

  • Percentage/CGPA ను BOAT ద్వారా పరిశీలిస్తారు
  • CGPA ఉన్నవారు → CGPA × 10 = Percentage

 2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

  • Shortlisted అభ్యర్థులకు email ద్వారా సమాచారం ఇస్తారు. 
  • ఒరిజినల్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా చూపాలి.

జీతం (Stipend Details)

UIIC Apprentice Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.9,000/- స్టైఫండ్ ఇస్తారు. 

దరఖాస్తు విధానం (How to Apply)

UIIC Apprentice Recruitment 2025 అభ్యర్థులు NATS Portal ద్వారానే దరఖాస్తు చేయాలి.

  1. https://nats.education.gov.in ను ఓపెన్ చేయండి
  2. Student Registration / Login చేయండి
  3. మీ Profile 100% పూర్తి చేయండి
  4. Apply Against Advertised Vacancies” ఎంపిక చేసి
  5. UNITED INDIA INSURANCE COMPANY LTD సెర్చ్ చేయండి
  6. “Apply” క్లిక్ చేయండి. Status అనేది “Applied” గా మారితే, అప్లికేషన్ కంప్లీట్ అయినట్లే.

ముఖ్యమైన తేదీలు (Important Dates)

  • అప్లికేషన్ ప్రారంభం: 18-12-2025
  • చివరి తేదీ: 20-01-2026
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్: Email ద్వారా తేదీ పంపబడుతుంది.
NotificationClick here
NATS PORTALClick here

Also Read : RBI Recruitment 2025 | “సాఫ్ట్‌వేర్, డేటా, రిస్క్ అనాలిటిక్స్… RBIలో టాప్ పోస్టులు!”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!