TS SSC 10th Class Results 2025 తెలంగాణ 10వ తరగతి ఫలితాల విడుదల చేసేందుకు TS SSC బోర్డు కసరత్తు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. పరీక్షలు రాసిన విద్యార్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయ్యింది. దీంతో పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీ విడుదల చేస్తున్నారు.
TS SSC 10th Class Results 2025 Release Date :
తెలంగాణ 10వ తరగతి ఫలితాల విడుదలపై బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి స్పష్టత వచ్చింది. ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేస్తున్నారు. రవీంద్ర భారతీలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 10వ తరగతి ఫలితాలను విడుదల చేస్తున్నారు.
10వ తరగతి మార్కుల మెమోల్లో కొత్త మార్పులు:
తెలంగాణ 10వ తరగతిలో ఇప్పటి వరకు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు క్యూములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ ఇచ్చేవారు. ఈ ఏడాది విద్యాశాఖ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ ఏడాది 10వ తరగతి మార్కుల మెమోలపై మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. మార్క్స్ మెమోలపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇస్తారు. మెమోలపై సీజీపీఏ ఇవ్వరు. విద్యార్థులు పాస్ అయ్యారా లేదా ఫెయిల్ అయ్యారా అనేది మెమోలపై ఉంటుంది. వీటితో పాటు బోధనేతర కార్యక్రమాలలో విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఫిజికల్, అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరిక్యులర్ యాక్టివిటీలకు సంబంధించి గ్రేడ్లను ముద్రిస్తారు.
How to Check TS SSC Results 2025 :
తెలంగాణ 10వ తరగతి ఫలితాలను చెక్ చేసుకోవడానికి హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ సహాయంతో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను ఆన్ లైన్ లో మరియు SMS ద్వారా రెండు విధాలుగా తెలుసుకోవచ్చు. పదో తరగతి ఫలితాలను ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
TS 10th Class Results 2025 Checking Process :
- విద్యార్థులు ముందుగా https://www.bse.telangana.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
- TS SSC Results పై క్లిక్ చేయాలి.
- విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.
- అంతే TS SSC Results కనిపిస్తాయి.
- ఈ ఫలితాలను పీడీఎఫ్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
TS 10th Class Results 2025 Checking Via SMS:
తెలంగాణ 10వ తరగతి ఫలితాలను ఆన్ లైన్ లోనే కాకుండా మీ మొబైల్ లో SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. SMS ద్వారా ఫలితాలను కింది స్టెప్పులు ఫాలో అయ్యి తెలుసుకోవచ్చు.
- మొబైల్ లో మెసేజ్ యాప్ ఓపెన్ చేయాలి.
- TS10 Role Number ఎంటర్ చేయండి.
- దీనిని 56263 కు మెసేజ్ చేయండి.
- అంతే తెలంగాణ 10వ తరగతి ఫలితాలు SMS ద్వారా వస్తాయి.
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ పెట్టుకోవచ్చు:
TS 10th Class Results 2025 చాలా మంది విద్యార్థులక వారు అనుకున్నంత మార్కులు రాకపోవచ్చు. అయితే మార్కులు కచ్చితంగా పెరుగుతాయి అని కాన్ఫిడెంట్ ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్ పెట్టుకోచవ్చు. రీకౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను వారి సంబంధిత పాఠశాలల ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
రీకౌంటింగ్ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
రీకౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తులను సంబంధిత పాఠశాళ ద్వారా సమర్పించాలి. పాఠశాల ద్వారా దరఖాస్తు ఫారమ్ నింపాలి. చలాన్ ద్వారా ఫీజు చెల్లించాలి.
- రీ వెరిఫికేషన్ ఫీజు : పేపర్ కి రూ.1,000/-
- రీకౌంటింగ్ ఫీజు : పేపర్ కి రూ.500/-
ఇక పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో స్టాంపులు లేని ఒక స్వీయ చిరునామా గల కవరు, హెడ్ మాస్టర్ చిరునామాతో ఒక కవర్, హాల్ టికెట్ జిరాక్స్ కాపీ, ఫలితాల తాత్కాలిక మార్క్స్ మెమో జత చేయాలి. సంబంధిత స్కూల్ హెడ్ మాస్టర్ నింపి ధ్రువీకరించిన ఫారమ్ ని జిల్లా విద్ాయ అధికారులు పేర్కొన్న కౌంటర్లకు పంపాలి.