TS Prasar Bharati Recruitment 2025 | తెలంగా ప్రసార భారతీలో జాబ్స్

TS Prasar Bharati Recruitment 2025: భారత పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్ దిగ్గజ సంస్థ ప్రసార భారతీ తాజాగా హైదరాబాద్ లోని కాార్యాలయంలో పని చేయడానికి ఉద్యోగాల నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. న్యూస్ ఎడిటర్, క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్సలేటర్ పోస్టును భర్తీ చేయనున్నారు. డిగ్రీ చదివిన వారు జర్నలిజం, ఎడిటింగ్ స్కిల్స్ కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారికి అవకాశం ఉంటుంది. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

TS Prasar Bharati Recruitment 2025

పోస్టుల వివరాలు : 

మొత్తం పోస్టుల సంఖ్య : 03

  • క్యాజువల్ ఎడిటర్(ఉర్దూ)  : 01
  • క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్ (ఉర్దూ) : 02 

TS Prasar Bharati Recruitment 2025

అర్హతలు : 

క్యాజువల్ ఎడిటర్(ఉర్దూ) : పోస్టులకు గ్రాడ్యుయేషన్ తో పాటు జర్నలిజంలో డిగ్రీ లేదా ఒక సంవత్సరం పీజీ డిప్లొమా లేదా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టింగ్/ఎడిటింగ్ లో 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి. అభ్యర్థులకు న్యూస్ డెస్క్ నిర్వహించడం మరియు ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టింగ్ లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. 

క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్(ఉర్దూ) : గ్రాడ్యుయేషన్ తో పాటు ఎంప్యానెల్ చేయబడే భాషలో ప్రావీణ్యం ఉండాలి. రీడింగ్ కోసం మంచి వాయిస్ ఉండాలి. రేడియో లేదా టీవీలో జర్నలిస్టిక్ పనిలో ఎక్స్ పీరియన్స్ కలిగి ఉండాలి. 

వయస్సు : 

TS Prasar Bharati Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు : 

TS Prasar Bharati Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్ కేటగిరీ అభ్యర్థులు జీఎస్టీతో కలిపి రూ.354/-, ఎస్సీ, ఎస్టీ,ఓబీసీ అభ్యర్థులు రూ.266/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజును Station Director, All India Radio, Hyderabad పేరుపై డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. 

ఎంపిక ప్రక్రియ: 

TS Prasar Bharati Recruitment 2025 లో క్యాజువల్ ఎడిటర్ పోస్టులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్ లేటర్ పోస్టులకు రాత పరీక్ష, వాయిస్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. 

జీతం : 

TS Prasar Bharati Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000/- జీతం చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. 

దరఖాస్తు విధానం : 

TS Prasar Bharati Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి కింద ఇవ్వబడిన అడ్రస్ కి పోస్టు చేయాలి. 

పోస్ట్ చేయవలసిన అడ్రస్ : 

హెడ్ ఆఫీస్, ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ – 500004

దరఖాస్తులకు చివరి తేదీ : 10 – 03 – 2025

Notification & Application : CLICK HERE

Official Website : CLICK HERE

Leave a Comment

Follow Google News
error: Content is protected !!