TS Endowment Recruitment 2025 : తెలంగాణ దేవాదాయ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన లీగల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తులు పెట్టుకోవాలి.
ఖాళీల వివరాలు :
తెలంగాణ దేవాదాయ శాఖలో లీగల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.
Also Read : NITD Non-Teaching Recruitment 2025 | విద్యాశాఖలో నాన్-టీచింగ్ జాబ్స్
అర్హతలు :
TS Endowment Recruitment 2025 అభ్యర్థులు తెలంగాణ జిల్లా కోర్టులో లేదా హైకోర్టులో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అడ్వకేట్ గా అనుభవం ఉండాలి.
- లీగల్ ఆఫీసర్ : హైకోర్టు లేదా జిల్లా కోర్టులో 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- అసిస్టెంట లీగల్ ఆఫీసర్ : జిల్లా కోర్టు లేదా హైకోర్టు లేదా ఏదైనా ప్రభుత్వ శాఖలో లీగల్ ఆఫీసర్ గా 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- అభ్యర్థులు హిందూ అభ్యర్థులై ఉండాలి.
ఎంపిక విధానం :
TS Endowment Recruitment 2025 అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు. అన్ని అర్హతలు ఉంటే జాబ్ ఇవ్వడం జరుగుతుది.
జీతం వివరాలు :
TS Endowment Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- లీగల్ ఆఫీసర్ : రూ.1,00,000/-
- అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ : రూ.44,000/-
దరఖాస్తు విధానం :
TS Endowment Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్లు పెట్టుకోవాలి. పూర్తి చేసిన అప్లికేషన్ ని అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి కింది ఇచ్చిన అడ్రస్ కి పంపాలి.
అడ్రస్ : ది కమిషనర్, తెలంగాణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, తెలంగాణ బోగ్గులకుంట, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్-500001
దరఖాస్తులకు చివరి తేదీ : 15 డిసెంబర్, 2025
| Notification | Click here |
| Application form | Click here |
| Official Website | Click here |
Also Read : IISER Non-Teaching Recruitment 2025 | IISERలో గవర్నమెంట్ జాబ్స్ – నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ