TGSRTC Recruitment 2025 | తెలంగాణ ఆర్టీసీలో 1500 ఉద్యోగాలు

TGSRTC Recruitment 2025 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో  ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్తం నిర్ణయించింది. మొత్తం 1500 డ్రైవర్ పోస్టులను  నియమించాలని సర్కులర్ జారీ చేసింది. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వీటిని భర్తీ చేయనున్నారు. అయితే పర్మనెంట్ పద్ధతిలో  అయితే  ఇప్పుడు తీసుకునే పరిస్థితి లేదు. అందుకోసం ప్రైవేట్ ఏజెన్సీల నుంచి ఎంప్లాయ్  మెంట్ ఎక్స్ఛేంజిల్లో నమోదైన  వారిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్కూట్మెంట్ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1500 మంది  డ్రైవర్లను వెంటనే నియమించుకుని వారికి రెండు వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు సర్కూలర్ లో పేర్కొంది. ఇప్పుడు తీసుకోబోతున్న 1500 మంది డ్రైవర్ల ఉద్యోగ కాలం మార్చి నుంచి జూన్ వరకు అంటే  4 నెలల వరకు వీరిని తీసుకుంటున్నట్లు ఆర్టీసీ పేర్కొంది. 

TGSRTC Recruitment 2025

పోస్టుల వివరాలు : 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 1500 మంది అవుట్ సోర్సింగ్ డ్రైవర్ల నియమాకాలు చేపట్టనున్నారు. ఆర్టీసీలో డ్రైవర్ల కొరతను తీర్చడానికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లను తీసుకోనున్నట్లు ప్రభుత్వం సర్కూలర్ జారీ చేసింది. 

అర్హతలు : 

TGSRTC Recruitment 2025 తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజ్ లో నమోదై ఉండాలి. హెవీ వెహికిల్ లైసెన్స్ తో పాటు భారీ వాహనాలు నడపడంలో 18 నెలల అనుభవం ఉండాలి. 160 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఏదైనా ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం వచ్చి ఉండాలి. 

వయస్సు : 

TGSRTC Recruitment 2025 తెలంగాణ ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్న డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ : 

TGSRTC Recruitment 2025 ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజ్ లో నమోదైన వారిని కాంట్రాక్టు విధానంలో తీసుకోనున్నారు. మ్యాన్ పవర్ సప్లయింగ్ సంస్థల నుంచి వీరిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. ఎంపికైన వారికి ఆర్టీసీ శిక్షణ సంస్థలో 15 రోజుల పాటు డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తారు. 

జీతం : 

TGSRTC Recruitment 2025 తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ పోస్టుకు ఎంపికైన వారికి 2024లో నిర్ధారించిన నెలవారీ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ రూ.22,415/- చెల్లించనున్నారు. ప్రతి డ్యూటీకి బత్తీ చెల్లిస్తారు. జంటనగరాల పరిధిలో అయితే రూ.200, జంట నగరాల వెలుపల అయితే రూ.100 చొప్పున ఇస్తారు. ఎంపికైన వారికి 15 పాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో రోజుకు రూ.200 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం మరియు ఫీజు:

TGSRTC Recruitment 2025 తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంస్థ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు వివరాల, దరఖాస్తు తేదీలను కూడా నోటిఫికేషన్ లో ఇస్తారు. 

3 thoughts on “TGSRTC Recruitment 2025 | తెలంగాణ ఆర్టీసీలో 1500 ఉద్యోగాలు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!