Telangana District Court Notification 2026 | తెలంగాణ జిల్లా కోర్టుల్లో భారీ నోటిఫికేషన్ – 859 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం

Telangana District Court Notification 2026: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు పెద్ద శుభవార్త వచ్చింది. తెలంగాణ హైకోర్టు 19 జనవరి 2026న Telangana District Court Notification 2026 ను అధికారికంగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో మొత్తం 859 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ భర్తీలు Judicial Ministerial మరియు Subordinate Service పరిధిలో జరుగుతాయి.

ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 24 జనవరి 2026 నుంచి 13 ఫిబ్రవరి 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)తో పాటు అవసరమైన పోస్టులకు టైపింగ్ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు.

Telangana District Court Notification 2026 – Overview

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో మినిస్టీరియల్ మరియు సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • సంస్థ: తెలంగాణ జిల్లా కోర్టులు
  • రిక్రూట్‌మెంట్ బాడీ: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు (TSHC)
  • మొత్తం ఖాళీలు: 859
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ మాత్రమే
  • ఆధికారిక వెబ్‌సైట్: https://tshc.gov.in

Also Read :  Exim Bank MT Recruitment 2026 | ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ బ్యాంకులో మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఉద్యోగాలు

ఖాళీల వివరాలు 

ఈ నోటిఫికేషన్‌లో మొత్తం తొమ్మిది రకాల పోస్టులు ఉన్నాయి. 

  • Office Subordinate – 319
  • Junior Assistant – 159
  • Process Server – 95
  • Copyist – 63
  • Field Assistant – 61
  • Examiner – 49
  • Typist – 42
  • Record Assistant – 36
  • Stenographer Grade–III – 35

 మొత్తం ఖాళీలు: 859

దరఖాస్తు విధానం

Telangana District Court Notification 2026 తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. దరఖాస్తులు 24 జనవరి 2026 నుంచి ప్రారంభమై 13 ఫిబ్రవరి 2026 (రాత్రి 11:59 వరకు) కొనసాగుతాయి.

ఎలా దరఖాస్తు చేయాలి?

  1. ముందుగా https://tshc.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లాలి
  2. “Recruitments” సెక్షన్‌పై క్లిక్ చేయాలి
  3. One Time Profile Registration (OTPR) పూర్తి చేయాలి
  4. లాగిన్ అయ్యి అర్హత ఉన్న పోస్టును ఎంపిక చేయాలి
  5. అవసరమైన వివరాలు నింపి డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి
  6. అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారమ్ సబ్మిట్ చేయాలి
  7. దరఖాస్తు కాపీని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి

 అర్హతలు

Telangana District Court Notification 2026 పోస్టును బట్టి విద్యార్హతలు మరియు స్కిల్ అవసరాలు భిన్నంగా ఉన్నాయి.

  • Stenographer Grade–III: డిగ్రీ + ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్ (120 wpm), టైపింగ్ (45 wpm), కంప్యూటర్ పరిజ్ఞానం
  • Junior Assistant: డిగ్రీ + కంప్యూటర్ నాలెడ్జ్
  • Typist: డిగ్రీ + ఇంగ్లీష్ టైపింగ్ (45 wpm)
  • Field Assistant: ఏదైనా డిగ్రీ
  • Examiner: ఇంటర్మీడియట్ (10+2)
  • Copyist: ఇంటర్మీడియట్ + ఇంగ్లీష్ టైపింగ్ (45 wpm)
  • Record Assistant: ఇంటర్మీడియట్
  • Process Server: 10వ తరగతి
  • Office Subordinate: 7వ నుంచి 10వ తరగతి వరకు అర్హత

వయోపరిమితి (01 జూలై 2026 నాటికి)

  • చాలా పోస్టులకు వయస్సు: 18 నుంచి 46 సంవత్సరాలు
  • Process Server పోస్టుకు గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు
  • SC, ST, BC, EWS, Ex-Servicemen మరియు PwD అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు

  • OC / BC అభ్యర్థులు: ₹600
  • SC / ST / EWS / Ex-Servicemen / PwD అభ్యర్థులు: ₹400

 జీతం వివరాలు

Telangana District Court Notification 2026 ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం జీతం లభిస్తుంది. 

  • Office Subordinate: ₹19,000 – ₹58,850
  • Junior Assistant / Typist / Field Assistant: ₹24,280 – ₹72,850
  • Stenographer Grade–III: ₹32,810 – ₹96,890
  • Process Server / Copyist / Examiner: ₹22,900 – ₹69,150

ఎంపిక ప్రక్రియ

Telangana District Court Notification 2026 తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది:

  1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) – జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, అరిథ్మెటిక్, రీజనింగ్ అంశాలపై ఉంటుంది
  2. స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్ – స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులకు మాత్రమే
  3. తుది మెరిట్ లిస్ట్ CBT మార్కుల ఆధారంగా తయారు చేస్తారు (స్కిల్ టెస్ట్ క్వాలిఫై చేయాలి).

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభం : 24 జనవరి, 2026
  • చివరి తేదీ : 13 ఫిబ్రవరి, 2025
Notification & Apply Click here

Also Read : NABARD Recruitment 2026 : డిగ్రీ అర్హతతో 162 డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు

1 thought on “Telangana District Court Notification 2026 | తెలంగాణ జిల్లా కోర్టుల్లో భారీ నోటిఫికేషన్ – 859 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!