Southern Railway Apprentice Recruitment 2025 దక్షిణ రైల్వే నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ ట్రేడ్లలో మొత్తం 3518 అప్రెంటీస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుడా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
Southern Railway Apprentice Recruitment 2025 Overview
నియామక సంస్థ | దక్షిణ రైల్వే |
పోస్టు పేరు | అప్రెంటిస్ |
ఖాళీల సంఖ్య | 3518 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తు ప్రక్రియ | 25 ఆగస్టు – 25 సెప్టెంబర్, 2025 |
వయోపరిమితి | 15 – 22 సంవత్సరాలు(ఫ్రెషర్స్), 15-24 సంవత్సరాలు (ఎక్స్ – ఐటీఐ / ఎంఎల్టీ) |
ఎంపిక ప్రక్రియ | మెరిట్ ఆధారంగా |
స్టైఫండ్ | రూ.6000 – రూ.7000 |
ఖాళీల వివరాలు :
దక్షణ మధ్య రైల్వే నుంచి వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే దాని డివిజన్లు, వర్క్ షాప్ లు మరియు యూనిట్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- మొత్తం ఖాళీల సంఖ్య : 3,518
అర్హతలు :
Southern Railway Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
ఫ్రెషర్స్ కేటగిరి :
- ఫిట్టర్, పెయింటర్, వెల్డర్ : 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
- MLT(రేడియాలజీ / పాథాలజీ / కార్డియాలజీ) : ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎక్స్-ఐటీఐ కేటగిరీ :
- 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత + NCVT / SCVT గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయోపరిమితి :
- ఫ్రెషర్స్ : 15 – 22 సంవత్సరాలు ఉండాలి
- ఎక్స్-ఐటీఐ / MLT : 15 – 24 సంవత్సరాలు ఉండాలి
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Southern Railway Apprentice Recruitment 2025 అభ్యర్థులు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ :
Southern Railway Apprentice Recruitment 2025 సంబంధిత ట్రేడ్ ని బట్టి 10వ తరగతి / 12వ తరగతి / ఐటీఐలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించరు.
జీతం వివరాలు :
Southern Railway Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ షిప్ సమయంలో స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
కేటగిరి | స్టైఫండ్ |
ఫ్రెషర్స్(10వ తరగతి) | నెలకు రూ.6,000/- |
ఫ్రెషర్స్ (12వ తరగతి) | నెలకు రూ.7,000/- |
ఎక్స్ – ఐటీఐ | నెలకు రూ.7,000/- |
దరఖాస్తు విధానం :
Southern Railway Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 25 ఆగస్టు, 2025
- దరఖస్తులకు చివరి తేదీ : 25 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Jobs