ప్రతి సంవత్సరం పండుగల సీజన్‌లో మనం ఎక్కువగా బంగారం కొనడం చూస్తాం. కానీ ఈసారి మాత్రం పరిస్థితి మారింది. వెండి (Silver) ఈ ఏడాది అందరి దృష్టిని ఆకర్షించింది. దేశవ్యాప్తంగా వెండి ధరలు కిలో ₹1,50,000 దాటాయి. గత ఏడాదితో పోలిస్తే ధరలు సుమారు 75% పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో 1 కిలో వెండి ధర ₹1,79,000 దాటగా, చెన్నైలో ₹1,97,000, సురత్ మరియు ఢిల్లీలో సగటు ధర ₹1,85,000కి చేరింది. గ్లోబల్ మార్కెట్లో కూడా రజతం ధర $52.18 / ounce వరకు పెరిగింది.
వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు(Why silver prices are rising in India) :
పరిశ్రమల్లో భారీ డిమాండ్(Industrial demand for silver in India):
వెండి ఇప్పుడు కేవలం నగల కోసం మాత్రమే కాదు, పరిశ్రమల్లోనూ ఎక్కువగా వినియోగిస్తున్నారు. సౌర ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), మొబైల్ ఫోన్లు, 5G టవర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాలు వంటి వాటిలో వెండిని ఎక్కువగా వాడుతున్నారు. ఈ రంగాల్లో డిమాండ్ పెరగడంతో వెండికి కూడా మార్కెట్ లో డిమాండ్ పెరిగింది.
సరఫరా తగ్గిపోవడం :
కొత్త సిల్వర్ గనులు ప్రారంభం కావడానికి సమయం పడుతోంది. సుమారు 7–8 సంవత్సరాలు పడుతుంది. పాత గనుల్లో ఉత్పత్తి తగ్గిపోవడంతో మార్కెట్‌లో వెండి కొరత ఏర్పడింది. అందుకే ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి.
సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా మారిన వెండి :
ప్రపంచ రాజకీయ పరిస్థితులు, యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి వంటి కారణాల వల్ల పెట్టుబడిదారులు వెండిని సేఫ్ ఇన్వెస్టిమెంట్ గా చూస్తున్నారు. ఇటీవల కొన్ని దేశాల కేంద్ర బ్యాంకులు కూడా వెండి కొనుగోలు చేయడం ప్రారంభించాయి. దీంతో వెండి విలువ బాగా పెరిగింది.
Best time to buy silver 2025
ప్రస్తుతం వెండి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల కొత్తగా పెట్టుబడి చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. ధరలు కొంత స్థిరపడిన తర్వాత లేదా తగ్గినప్పుడు కొనడం బెటర్. లాంగ్‌టర్మ్ ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశం కావొచ్చు.
పెట్టుబడిదారులకు సూచనలు
- ఇప్పటి ధరల వద్ద కొత్తగా ఎక్కువగా కొనడం మంచిది కాదు.
- మార్కెట్ కొంత స్థిరపడిన తర్వాత కొనడం బెటర్.
- చిన్న మొత్తంలో, దీర్ఘకాలం దృష్టితో పెట్టుబడి చేయడం సురక్షితం.
- అనుభవజ్ఞులైన బ్రోకర్ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.
Also Read : HVF Junior Technician Recruitment 2025 | హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో బంపర్ జాబ్స్
1 thought on “Silver Price Today in India 2025 | బంగారం కాదు.. ఇప్పుడు వెండి రాజ్యం..”