SIB Junior Officer (Operations) Recruitment 2025 | సౌత్ ఇండియన్ బ్యాంకులో జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు

SIB Junior Officer (Operations) Recruitment 2025 : భారతదేశంలోని ప్రముఖ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులలో ఒకటైన South Indian Bank Limited నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ ఆఫీసర్ (ఆపరేషన్స్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నియామకాలు కాంట్రాక్ట్ పద్ధతిలో చేపడుతున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఖాళీల వివరాలు (Vacancy Details) : 

సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి జూనియర్ ఆఫీసర్ (ఆపరేషన్స్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఖాళీల సంఖ్యను నోటిఫికేషన్ లో ప్రస్తావించబడలేదు. ఈ నియామకాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించినవి. స్థానిక భాష పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

Also Read : Nothing Phone 3a Lite India Launch Soon | Price ₹20,000 Expected

అర్హతలు (Eligibility Criteria) : 

  • ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ (కనీసం 50% మార్కులు)
  • కనీసం 1 సంవత్సరం బ్యాంక్/ NBFC / ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్‌లో అనుభవం

వయోపరిమితి : 

అభ్యర్థులకు 30.09.2025 నాటికి గరిష్ట వయసు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు.

  • జనరల్ : రూ.500/-
  • ఎస్సీ / ఎస్టీ : రూ.200/-

ఎంపిక ప్రక్రియ(Selection Process): 

1.Online Test (Remote Proctored Mode)

అభ్యర్థులు తమ ఇంటి నుండి ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ ద్వారా ఆన్‌లైన్ పరీక్ష రాయవచ్చు.

  • వెబ్‌క్యామ్, మైక్రోఫోన్, స్క్రీన్ పర్యవేక్షణ జరుగుతుంది.

2.Group Discussion (GD)

3.Personal Interview

Also Read : NSUT Faculty Recruitment 2025 | అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్

జీతం వివరాలు (Salary & Benefits): 

ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి ₹4.86 లక్షల నుండి ₹5.04 లక్షల వరకు ప్యాకేజీతో జీతం ఇవ్వడం జరుగుతుంది. జీతంలో NPS కాంట్రిబ్యూషన్, ఇన్సూరెన్స్ ప్రీమియం మరియు పనితీరు ఆధారిత వేరియబుల్ పే కలుపుకుని ఉంటుంది. ప్రతి సంవత్సరం పనితీరు ఆధారంగా ఇన్ క్రిమెంట్స్ ఉంటాయి. గ్రూప్ మెడికల్, యాక్సిడెంట్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి. అధికారిక ప్రయాణాలకు లాడ్జింగ్, ట్రావెల్, హాల్టింగ్ అలవెన్సులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం (How to Apply) : 

  • అధికారిక వెబ్‌సైట్ www.southindianbank.com కు వెళ్లాలి. 
  •  “Careers → Current Openings” సెక్షన్‌లోకి వెళ్లాలి.
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • ఒక్క రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేయాలి.
  • ఫోటో, సిగ్నేచర్, రిజ్యూమ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు ఇచ్చిన పరిమాణంలో అప్లోడ్ చేయాలి.
  • ఫీజు చెల్లించిన తర్వాత Application Ref. ID నంబర్ సేవ్ చేసుకోవాలి.
  • విజయవంతంగా సబ్మిట్ చేసిన ప్రొఫైల్‌ మాత్రమే ఎంపిక ప్రక్రియకు పరిగణించబడుతుంది.

ముఖ్యమైన తేదీలు: 

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15 అక్టోబర్ 2025
  • దరఖాస్తు చివరి తేదీ: 22 అక్టోబర్ 2025
  • టెంట్‌టేటివ్ పరీక్ష తేదీలు: 1 మరియు 2 నవంబర్ 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : RITES Recruitment 2025 | RITES సంస్థలో 600+ ఇంజినీరింగ్ పోస్టులు!

3 thoughts on “SIB Junior Officer (Operations) Recruitment 2025 | సౌత్ ఇండియన్ బ్యాంకులో జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!