భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం నుంచి కోలుకున్న తర్వాత, తన కొత్త హెయిర్ స్టయిల్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. మహమ్మద్ షమీ బట్టతల సమస్యతో బాధపడ్డాడు. అయితే అనూహ్యంగా అతడి హెయిర్ స్టయిల్ మారిపోయింది. షమీ హెయిర్ ఒత్తుగా కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే మహ్మద్ షమీ తన బట్టతల సమస్యను ఎలా అధికమించారో తెలుసుకుందాం.
మహ్మద్ షమీ బట్టతల సమస్యను పరిష్కరించడంలో అలీమ్ హకీమ్ ప్రముఖ పాత్ర పోషించాడు. అలీమ్ హకీమ్ సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్. ప్రముఖ క్రికెటర్లు తమ హెయిర్ స్టయిల్ కోసం అలీమ్ హకీమ్ తో తరచుగా సంప్రదిస్తుంటారు. మహ్మద్ షమీ కూడా అలీమ్ హకీమ్ సెలూన్ లో హెయిర్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అతని వద్ద హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నాడు. ఈ ప్రక్రియ డీహెచ్ టీ టెక్నిక్ ఉపయోగంచి చేస్తారని సమాచారం. జుట్టు మూలాలను మెరుగుపరచడమే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఒక్కో హయిర్ ట్రాన్స్ ప్లాంట్ కు రూ.100 నుంచి రూ.500 ఖర్చు అవుతుందని తెలుస్తోంది.
భారత జట్టు మేనేజ్‌మెంట్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీని జాగ్రత్తగా సంప్రదిస్తున్నట్లు ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. జట్టులో అతని పునరాగమనం షమీ ఫిట్ నెస్ పై ఆధారపడి ఉంది. నవంబర్ 2023లో వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత షమీ మళ్లీ క్రికెట్ ఆడలేదు.