SCI Recruitment 2025 దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. సుప్రీం కోర్టులో సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ మరియు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు గ్రూప్ ‘బి’ నాన్్ గెజిటెడ్ పోస్టులు. అర్హులైన అభ్యర్థులు జూన్ 6వ తేదీ నుంచి జూన్ 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
SCI Recruitment 2025
పోస్టుల వివరాలు :
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టెక్నాలజీ రంగంలో నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కోసం ఉద్యోగ ప్రకటన చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ – కమ్ – సీనియర్ ప్రోగ్రామర్ మరియు జూనియర్ అసిస్టెంట్ – కమ్ -జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగాల నియామకాలను చేపడుతున్నారు.
- సంస్థ పేరు : సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా
- పోస్టు పేరు : సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ – కమ్ – సీనియర్ ప్రోగ్రామర్, జూనియర్ అసిస్టెంట్ – కమ్ – జూనియర్ ప్రోగ్రామర్
- పోస్టుల సంఖ్య : 26
- జాబ్ లొకేషన్ : న్యూఢిల్లీ
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ – కమ్ – సీనియర్ ప్రోగ్రామర్ | 06 |
జూనియర్ అసిస్టెంట్ – కమ్ -జూనియర్ ప్రోగ్రామర్ | 20 |
మొత్తం పోస్టుల సంఖ్య | 26 |
అర్హతలు :
SCI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతల వివరాలు కింద ఇవ్వడం జరిగింది.
- సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ : BE / B.Tech / MCA / MSC (Computers) / BCA / BSc (Computers) ఉత్తీర్ణత + కంప్యూటరీకరణ రంగంలో 6 సంవత్సరాల అనుభవం.
- జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ : BE / B.Tech / BCA / BSc(Computers) ఉత్తీర్ణులై ఉండాలి. అనుభవం అవసరం లేదు.
వయస్సు :
SCI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వయోపరిమితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
- సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ : 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ : 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
SCI Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
కేగటిరీ | అప్లికేషన్ ఫీజు |
జనరల్ / ఓబీసీ | రూ.1,000/- |
ఎస్సీ / ఎస్టీ / ఎక్స్ సర్వీస్ మెన్ / దివ్యాంగులు | రూ.250/- |
ఎంపిక ప్రక్రియ:
SCI Recruitment 2025 సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ మరియు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ ప్రోగ్రామర్ రెండు పోస్టులకు నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) : జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పై ప్రశ్నలు ఉంటాయి.
- ఆబ్జెక్టివ్ టైప్ టెక్నికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ : అభ్యర్థి టెక్నికల్ నాలెడ్జ్ అంచనా వేయడానికి నిర్వహిస్తారు.
- ప్రాక్టికల్ ఆప్టిట్యూట్ టెస్ట్ : పై రెండు పరీక్షల్లో అర్హత సాధించిన వారి ఆచరణాత్మక నైపుణ్యాలను అంచనా వేయడానికి ప్రాక్టికల్ పరీక్ష నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూ : ప్రాక్టికల్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
జీతం వివరాలు :
SCI Recruitment 2025 సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ పోస్టులకు బేసిక్ పే రూ.47,600/- తో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులకు బేసిక్ పే రూ.35,400/- పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
- సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ : బేసిక్ పే రూ.47,600/- + ఇతర అలవెన్సులు
- జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ : బేసిక్ పే రూ.35,400/- + ఇతర అలవెన్సులు
దరఖాస్తు విధానం :
SCI Recruitment 2025 పోస్టులకు సుప్రీం కోర్టు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు సుప్రీం కోర్టు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- హోమ్ పేజీలో రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : జూన్ 6, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 27, 2025
Notification | Click here |
Apply Online | Click here |