SBI Clerk Recruitment 2025 దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 5,583 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.
SBI Clerk Recruitment 2025 Overview
నియామక సంస్థ | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
పోస్టు పేరు | జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) |
పోస్టుల సంఖ్య | 5583 |
దరఖాస్తు ప్రక్రియ | 6 ఆగస్టు – 26 ఆగస్టు, 2025 |
జాబ్ లొకేషన్ | ఆల్ ఇండియా |
పోస్టుల వివరాలు :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 5,583 పోస్టులు ఖాళీగా ఉండగా, వీటిలో 5,180 రెగ్యులర్ ఖాళీలు, 403 బ్యాక్ లాగ్ ఖాళీలు ఉన్నాయి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 5,583
- ఆంధ్రప్రదేశ్ లో ఖాళీలు : 313
- తెలంగాణలో ఖాళీలు : 250
అర్హతలు :
SBI Clerk Recruitment 2025 అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- ఏదైనా డిగ్రీ
వయస్సు :
SBI Clerk Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- 20 – 28 సంవత్సరాలు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు
- ఓబీసీ అభ్యర్థులక 3 సంవత్సరాలు వయోసడలింపు
అప్లికేషన్ ఫీజు :
SBI Clerk Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ : రూ.750/-
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
SBI Clerk Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- ప్రిలిమినరీ టెస్ట్
- మెయిన్స్ ఎగ్జామ్
- స్థానిక భాష పరీక్ష
ప్రిలిమినరీ టెస్ట్: ప్రిలిమినరీ టెస్ట్ 100 మార్కులకు ఆన్ లైన్ లో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఒక గంట వ్యవధి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
విషయం | ప్రశ్నలు | మార్కులు | సమయం |
ఇంగ్లీష్ | 30 | 30 | 20 నిమిషాలు |
న్యూమరికల ఎబిలిటీ | 35 | 35 | 20 నిమిషాలు |
రీజనింగ్ ఎబిలిటీ | 35 | 35 | 20 నిమిషాలు |
మొత్తం | 100 | 100 | 1 గంట |
మెయిన్ ఎగ్జామ్ : ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ ఎగ్జామ్ కు పిలుస్తారు. మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. 2.40 గంటల సమయం ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
విషయం | ప్రశ్నలు | మార్కులు | సమయం |
జనరల్ / ఫైనాన్షియల్ అవేర్నెస్ | 50 | 50 | 35 నిమిషాలు |
జనరల్ ఇంగ్లీష్ | 40 | 40 | 35 నిమిషాలు |
క్వాంటిటేటివ్ ఆఫ్టిట్యూడ్ | 50 | 50 | 45 నిమిషాలు |
రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ | 50 | 60 | 45 నిమిషాలు |
మొత్తం | 190 | 200 | 2 గంటల 40 నిమిషాలు |
జీతం వివరాలు :
SBI Clerk Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.24,050 – రూ.64,480/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అన్ని కలుపుకుని నెలకు రూ.45,000/- వరకు జీతం అందుతుంది.
దరఖాస్తు విధానం :
SBI Clerk Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్ పేజీలో Junior Associate(Customer Support & Sales) Recruitment పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- చేతితో రాసిన డిక్లరేషన్ టెక్ట్స్ అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
డిక్లరేషన్ : ‘నేను, ———-(అభ్యర్థి పేరు), పుట్టిన తేదీ———–, దరఖాస్తు ఫారమ్ లో నేను సమర్పించిన సమాచారం అంతా సరైనది, నిజమైనది మరియు చెల్లుబాటు అయ్యేది అని ఇందుమూలంగా ప్రకటిస్తున్నాను. అవసరమైనప్పుడు నేను సహాయక పత్రాలను సమర్పిస్తాను, సంతకం, ఫొటో గ్రాఫ్ మరియు ఎడమ బొటనవేలు ముద్ర నాది’
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 06.08.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 26.08.2025
Notification | Click here |
Apply Online | Click here |