ఉన్నత విద్యను కొనసాగించడం చాలామందికి భారంగా మారుతుంది. ముఖ్యంగా వార్షిక ఆదాయం ₹6 లక్షల కంటే తక్కువ కుటుంబాల విద్యార్థులకు. ఈ సమస్యను తగ్గించడానికి SBI Foundation తన ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2025ను ప్రవేశపెట్టింది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా ద్వారా UG, PG, మెడికల్, Overseas మరియు స్కూల్ విద్యార్థులు కూడా ₹20 లక్షల వరకు ఆర్థిక సాయం పొందవచ్చు. ఇది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌లలో ఒకటి, మరియు 23,000+ విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.SBI 2025–26 సంవత్సరానికి ₹90 కోట్లు కేటాయించింది, దాంతో 23,230 bright students కి ఈ సాయం అందించనున్నారు. నవంబర్ 15వ తేదీ వరకు ఈ స్కాలర్ షిప్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు.

ఎవరు అప్లై చేసుకోవచ్చు?
స్కూల్ విద్యార్థులు (Class 9–12)
- ఏ భారతీయ విద్యార్థులు అర్హులు
- కుటుంబ ఆదాయం ₹3,00,000 లోపు
- కనీసం 75% మార్కులు / 7 CGPA
UG (Undergraduate) విద్యార్థులు
- NIRF టాప్ 300 కళాశాలలలో చదివే వారు
- కుటుంబ ఆదాయం ₹6,00,000 లోపు
- కనీసం 75% మార్కులు లేదా 7 CGPA (SC/ST: 67.5% లేదా 6.3 CGPA)
- IITలు, NAAC A-గ్రేడ్ ఇన్స్టిట్యూట్స్‌లో చదివే వారు కూడా అర్హులు
PG (Postgraduate) విద్యార్థులు
- NIRF టాప్ 300 ఇన్స్టిట్యూట్స్ లేదా IIMలో MBA/PGDM
- కుటుంబ ఆదాయం ₹6,00,000 లోపు
- కనీసం 75% మార్కులు లేదా 7 CGPA (SC/STకి రాయితీ)
- మెడికల్ PG కోర్సులు మరియు SC/ST Overseas PG విద్యార్థులు కూడా అర్హులు
ప్రత్యేక వర్గాలు
- IIT/IIM విద్యార్థులకు ప్రత్యేక స్లాట్లు
- 12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత గరిష్టంగా 2 సంవత్సరాల గ్యాప్ అనుమతించబడుతుంది.
స్కాలర్‌షిప్ మొత్తం (Course-wise)
కోర్స్ | మొత్తం |
స్కూల్ (9–12) | ₹15,000 వరకు |
UG | ₹75,000 |
PG | ₹2,50,000 |
మెడికల్ PG | ₹4,50,000 |
IIT | ₹2,00,000 |
IIM | ₹5,00,000 |
Also Read : PhonePe లో Personal Loan: ఫోన్ పే వాడే వారికీ గుడ్ న్యూస్ – ₹10,000 నుంచి ₹5 లక్షల వరకు అవకాశం!
దరఖాస్తు విధానం (How to Apply)
- sbiashascholarship.co.in కి వెళ్లి UG/PG/School కేటగిరీ ఎంచుకోండి.
- ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ అవ్వండి.
- వ్యక్తిగత, విద్యా, ఆదాయం వివరాలు నమోదు చేయండి.
- అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయండి (మార్క్‌షీట్లు, ఆదాయం సర్టిఫికేట్, బ్యాంక్ పాస్‌బుక్ మొదలైనవి)
- ఫారమ్ చెక్ చేసి సబ్మిట్ చేయండి.
- కన్ఫర్మేషన్ కాపీ సేవ్ చేసుకోండి.
చివరి తేదీ: నవంబర్ 15, 2025 (రాత్రి 11:59)
అవసరమైన పత్రాలు
- చివరి విద్యా సంవత్సరం మార్క్‌షీట్
- Aadhaar/గవర్నమెంట్ ID
- ఆదాయం సర్టిఫికేట్
- కాలేజ్ అడ్మిషన్ లేదా బోనాఫైడ్ సర్టిఫికేట్
- బ్యాంక్ పాస్‌బుక్ / స్టేట్‌మెంట్
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- SC/ST అభ్యర్థులకు కుల సర్టిఫికేట్
ఎంపిక ప్రక్రియ
- షార్ట్‌లిస్టింగ్ – మార్కులు మరియు కుటుంబ ఆదాయం ఆధారంగా
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ – అప్‌లోడ్ చేసిన పత్రాలను చెక్ చేస్తారు
- ఫైనల్ సెలెక్షన్ – కొన్ని అభ్యర్థులను ఫోన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసే అవకాశం
- ఫలితాలు – డిసెంబర్ 2025లో ప్రకటించబడతాయి
- సాయం విడుదల – జనవరి 2026లో
స్కాలర్‌షిప్ పొందే చిట్కాలు
- చివరి తేదీకి ముందే అప్లై చేయండి
- మీ కాలేజ్ NIRF ర్యాంక్ ధృవీకరించండి
- పత్రాలు స్పష్టంగా, తాజా ఉండాలి
- లాగిన్ వివరాలను భద్రపరచండి
Apply Now | Click here |
Also Read : Post Office FD: భార్య పేరుపై ₹1 లక్ష FD పెడితే 24 నెలల తర్వాత మీకు ఎంత వస్తుంది?