RRC NWR Apprentice Recruitment 2025 : రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ వెస్ట్రన్ రైల్వే, జైపూర్ నుంచి యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశంలోని యువతకు భారత రైల్వేలో శిక్షణా అవకాశంగా ఈ నోటిఫికేషన్ మంచి అవకాశం. మొత్తం 2,162 పోస్టులు వివిధ డివిజన్లు మరియు వర్క్‌షాప్‌లలో భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

RRC NWR Apprentice Recruitment 2025 Overview
నియామక సంస్థ | నార్త్ వెస్ట్రన్ రైల్వే, జైపూర్ |
పోస్టు పేరు | అప్రెంటిస్ |
ఖాళీల సంఖ్య | 2,162 |
దరఖాస్తు ప్రక్రియ | 3 అక్టోబర్ – 2 నవంబర్, 2025 |
అధికారిక వెబ్ సైట్ | https://rrcjaipur.in |
Also Read : RRC ECR Sports Quota Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో జాబ్స్
ఖాళీల వివరాలు :
రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ వెస్ట్రన్ రైల్వే, జైపూర్ వివిధ డివిజన్లు మరియు వర్క్ షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,162 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
డివిజన్ల వారీగా ఖాళీలు:
- అజ్మీర్ డివిజన్ : 426
- బికనేర్ డివిజన్ : 475
- జైపూర్ డివిజన్ : 545
- జోధ్‌పూర్ డివిజన్ : 450
- BTC Carriage & Wagon Workshop, అజ్మీర్ : 97
- BTC LOCO, అజ్మీర్ : 68
- కార్మిక వర్క్‌షాప్, బికనేర్ : 33
- కార్మిక వర్క్‌షాప్, జోధ్‌పూర్ : 68
అర్హతలు :
RRC NWR Apprentice Recruitment 2025 అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 0వ తరగతిలో కనీసం 50% మార్కులు ఉండాలి.
వయోపరిమితి :
RRC NWR Apprentice Recruitment 2025 అభ్యర్థులకు 02.11.2025 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లకేషన్ ఫీజు :
RRC NWR Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- General / OBC / EWS: ₹100/-
- SC / ST / మహిళా అభ్యర్థులు / PwBD: ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
RRC NWR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. 10వ తరగతి మరియు ఐటీఐ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
Also Read : RRB JE Recruitment 2025 | రైల్వేలో 2,570 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్
స్టైఫండ్ వివరాలు :
RRC NWR Apprentice Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో రైల్వే బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
RRC NWR Apprentice Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు rrcjaipur.in వెబ్‌సైట్ ని సందర్శించాలి.
- హోమ్ పేజీలో అప్రెంటిస్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 3 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 2 నవంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : RRB NTPC Notification 2025 Out | రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 8,850 పోస్టులు
1 thought on “RRC NWR Apprentice Notification 2025 | 2162 ఖాళీలకు రైల్వే నోటిఫికేషన్.. వెంటనే అప్లయ్ చేయండి”