RRB Isolated Recruitment 2025 : రైల్వే శాఖ నుంచి మరో పెద్ద నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో Isolated Categories పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 312 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైల్వేలో స్థిరమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక అద్భతమైన అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 29, 2026 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
ఖాళీల వివరాలు :
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరీల్లో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 312 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
| పోస్టు పేరు | ఖాళీలు |
| Chief Law Assistant | 22 |
| Public Prosecutor | 7 |
| Junior Translator (Hindi) | 202 |
| Senior Publicity Inspector | 15 |
| Staff & Welfare Inspector | 24 |
| Scientific Assistant (Training) | 2 |
| Lab Assistant Gr-III (Chemist & Metallurgist) | 39 |
| Scientific Supervisor (Ergonomics & Training) | 1 |
Also Read : Railway RRB Group D Recruitment 2026 | రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 22,000 గ్రూప్ డి ఉద్యోగాలు
అర్హతలు :
RRB Isolated Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల అర్హతలు మారుతాయి.
- చీఫ్ లా ఆఫీసర్ : Law లో డిగ్రీ (LLB) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత న్యాయ రంగంలో అనుభవం ఉండాలి.
- పబ్లిక్ ప్రాసిక్యూటర్ : LLB డిగ్రీ ఉండాలి. కోర్టుల్లో ప్రాక్టికల్ అనుభవం అవసరం.
- జూనియర్ ట్రాన్స్ లేటర్(హిందీ) : Hindi లో Master’s Degree లేదా డిగ్రీలో హిందీ సబ్జెక్టుగా Englishలో Master డిగ్రీ. Hindi నుంచి English అనువాదంలో నైపుణ్యం ఉండాలి.
- సీనియర్ పబ్లిసిటీ ఇన్ స్పెక్టర్ : Graduation + PG Diploma / Degree in Journalism / Mass Communication / Public Relations
- స్టాఫ్ & వెల్ఫేర్ ఇన్ స్పెక్టర్ : గ్రాడ్యుయేషన్ + లేబర్ / సోషల్ వెల్ఫేర్ లో డిప్లొమా లేదా LLB with లేబర్ లా లేదా MBA in HR
- సైంటిఫిక్ అసిస్టెంట్(ట్రైనింగ్) : సైకాలజీలో మాస్టర్ డిగ్రీ + అనుభవం
- ల్యాబ్ అసిస్టెంట్(గ్రేడ్-3)(Chemist & Metallurgist) : సైన్స్ స్ట్రీమ్ తో 10+2
- సైంటిఫిక్ సూపర్ వైజర్ (Ergonomics & Training) : సైకాలజీలో మాస్టర్ డిగ్రీ + అనుభవం
వయోపరిమితి :
RRB Isolated Recruitment 2025 అభ్యర్థులకు 01-01-2026 నాటికి పోస్టును బట్టి 30-40 సంవత్సరాలు ఉండాలి. SC / ST / OBC / PwBD / Ex-Servicemen అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
RRB Isolated Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.500/- – CBT రాసిన వారికి రూ.400/- రీఫండ్ ఇస్తారు.
- ఎస్సీ / ఎస్టీ / మహిళలు / ఎక్స్ సర్వీస్ మెన్ / పీడబ్ల్యూడీ : రూ.250/- – CBT రాసిన వారికి రూ.250/- రీఫండ్ ఇస్తారు.
ఎంపిక ప్రక్రియ :
RRB Isolated Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష
- స్కిల్ / టైపింగ్ టెస్ట్(కొన్ని పోస్టులకు)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
RRB Isolated Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
| పోస్టు పేరు | జీతం |
| Chief Law Assistant | రూ.44,900/- |
| Public Prosecutor | రూ.44,000/- |
| Junior Translator (Hindi) | రూ.35,400/- |
| Senior Publicity Inspector | రూ.35,400/- |
| Staff & Welfare Inspector | రూ.35,400/- |
| Scientific Assistant (Training) | రూ.35,400/- |
| Lab Assistant Gr-III (Chemist & Metallurgist) | రూ.19,900/- |
| Scientific Supervisor (Ergonomics & Training) | రూ.44,900/- |
దరఖాస్తు విధానం :
RRB Isolated Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసకోవాలి.
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ లో వెళ్లాలి.
- అకైంట్ రిజిస్ట్రేషన్ చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- ఫొటో, సంతకం, అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభం : 30 డిసెంబర్, 2025
- చివరి తేదీ : 29 జనవరి, 2026
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : India Post Driver Recruitment 2026 | 10వ తరగతి అర్హతతో పోస్టాఫీస్ డ్రైవర్ ఉద్యోగం