Railway RRB Group D Recruitment 2026 | రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 22,000 గ్రూప్ డి ఉద్యోగాలు

Railway RRB Group D Recruitment 2026 : భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన Railway Recruitment Boards (RRBs) నుంచి భారీ నోటిఫికేషన్ వచ్చింది. 2026 సంవత్సరానికి Group D Level-1 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సుమారు మొత్తం 22,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  ఆన్‌లైన్ అప్లికేషన్లు 21 జనవరి 2026 నుంచి ప్రారంభమవుతాయి, అభ్యర్థులు 20 ఫిబ్రవరి 2026 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. 

ఖాళీల వివరాలు

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా మొత్తం సుమారు 22,000 Group D పోస్టులు భర్తీ చేయనుంది.  ఇవి అన్నీ Level-1 ఉద్యోగాలు. అన్ని RRBలలో ఖాళీలు ఉంటాయి.

మొత్తం పోస్టులు: 22,000 (సుమారు)

పోస్టుల పేర్లు: 

  • ట్రాక్ మెయింటెయినర్
  • పాయింట్స్ మన్-బి
  • అసిస్టెంట్(ఎస్ అండ్ టి)
  • అసిస్టెంట్(బ్రిడ్జ్)
  • అసిస్టెంట్(ట్రాక్ మెషిన్)
  • అసిస్టెంట్(TL&AC(వర్క్ షాప్)
  • అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్)
  • అసిస్టెంట్ పి-వే
  • అసిస్టెంట్TL & AC
  • అసిస్టెంట్ (TRD)
  • అసిస్టెంట్(C & W)
  • అసిస్టెంట్ వర్క్ షాప్ మెకానిక్

Also Read : BSF Sports Quota Recruitment 2025 | 549 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

అర్హతలు (Eligibility)

Railway RRB Group D Recruitment 2026 డీటైల్‌డ్ నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు వస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. 

వయోపరిమితి 

Railway RRB Group D Recruitment 2026 అభ్యర్థులకు 01.01.2026 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మద్య వయస్సు ఉండాలి. SC/ST, OBC, PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు

ఫీజు వివరాలు అధికారిక CEN నోటిఫికేషన్‌లో ఇవ్వబడతాయి. గత RRB రిక్రూట్మెంట్స్ ప్రకారం ఫీజు అంచనా ఇలా ఉంది. 

  • General/OBC: ₹500 (రూ.400/- రీఫండ్ ఉండే అవకాశం)
  • SC/ST/PwBD/Women: ₹250 (పూర్తిగా రీఫండ్ అయ్యే అవకాశం)

ఎంపిక విధానం (Selection Process)

Railway RRB Group D Recruitment 2026 అభ్యర్థులను కింది దశల్లో ఎంపిక చేస్తారు. 

  1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
  2. డాక్యుమెంట్ వెరిఫికేషన్
  3. మెడికల్ టెస్ట్

జీతం వివరాలు (Salary Details)

Railway RRB Group D Recruitment 2026 Group D ఉద్యోగాలు 7th CPC Pay Matrix Level-1 లో ఉంటాయి. ప్రాథమిక జీతం నెలకు ₹18,000/- ఉంటుంది. DA, HRA, TA మరియు ఇతర ప్రభుత్వ భత్యాలు అదనంగా అందుతాయి.

దరఖాస్తు విధానం

Railway RRB Group D Recruitment 2026 అప్లికేషన్ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి.

  1. అధికారిక పోర్టల్‌కి వెళ్లండి: https://www.rrbapply.gov.in
  2. నోటిఫికేషన్ ఎంపికచేసి New Registration పై క్లిక్ చేయండి.
  3. మీ వ్యక్తిగత వివరాలు, విద్యా వివరాలు నమోదు చేయండి.
  4. ఫోటో, సంతకం, Aadhaar, 10th certificate అప్‌లోడ్ చేయండి.
  5. Aadhaar verification ఆప్షన్ తప్పక ఎంచుకోండి
  6. క్యాటగిరీ ప్రకారం అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
  7. Submit చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తులు ప్రారంభం : 21 జనవరి, 2026
  • చివరి తేదీ : 20 ఫిబ్రవరి, 2026

Also Read : UPSC NDA 2026 Notification |  ఇంటర్ తర్వాత డైరెక్ట్‌గా ఆఫీసర్ ఉద్యోగం – 394 పోస్టులు

4 thoughts on “Railway RRB Group D Recruitment 2026 | రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 22,000 గ్రూప్ డి ఉద్యోగాలు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!