PM Internship Scheme 2025 PM ఇంటర్న్ షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 12వ తేదీ వరకు పీఎం ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఇంటర్న్ షిప్ కి అర్హులు. ఈ ఇంటర్న్ షిప్ యొక్క పూర్తి వివరాలను చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
PM Internship Scheme 2025
ఇంటర్న్ షిప్ వివరాలు :
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ ఇంటర్న్ షిప్ ద్వారా ఐదేళ్లలో 10 లక్షల మంది యువతకు ఇంటర్న్ షిప్ అందించనుంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులకు దాదాపు 300 కు పైగా కంపెనీల్లో లక్షకు పైగా ఇంటర్న్ షిప్ అందిస్తుంది. యువతకు కీలకమైన నైపుణ్యాలు మరియు పరిశ్రమ పరిజ్ఞానంతో సన్నద్ధం చేస్తారు. దీంతో యువతో ఉపాధి సామర్థ్యం మెరుగుపడుతుంది.
అర్హతలు :
PM Internship Scheme 2025 పీఎం ఇంటర్న్ షిప్ కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి, 12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఐటిఐ, పాలిటెక్నిక్, బీఏ, బీసీఏ, బీబీఏ, బీపార్మసీ వంటి డిగ్రీలు చేసిన వారు కూడా అర్హులు. అయితే ప్రొఫెనల్ డిగ్రీలు బీటెక్, ఎంబీఏ, సీఏ మొదలైనవి చేసిన అభ్యర్థులు అర్హులు కాదు. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి.
వయస్సు:
PM Internship Scheme 2025 పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఓబీసీ / ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
PM Internship Scheme 2025 పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ లో రిజిస్ట్రేసన్ చేసుకోవడానికి అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
PM Internship Scheme 2025 పీఎం ఇంటర్న్ షిప్ కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వారి విద్యార్హత, ఇతర అర్హతల ద్వారా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు.
జీతం :
PM Internship Scheme 2025 పీఎం ఇంటర్న్ షిప్ కి ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల పాటు ఇంటర్న్ షిప్ శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో నెలకు రూ.5,000/- స్టైఫండ్ ఇస్తారు. స్టైఫండ్ అనేది డైరెక్టుగా అభ్యర్థి ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. స్టైపండ్ తో పాటు ప్రభుత్వం నుంచి ఇంటర్న్ షిప్ ప్రారంభంలో రూ.6,000/- వన్ టైమ్ గ్రాంట్ ఇస్తారు. దీంతో పాటు అభ్యర్థులు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద కూడా కవర్ చేయబడతారు. ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.
దరఖాస్తు విధానం :
PM Internship Scheme 2025 దరఖాస్తు చేసుకున అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ ల దరఖాస్తు చేసుకోవాలి. కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
- దరఖాస్తులకు చివరి తేదీ : 12 – 03 – 2025
Apply Online : CLICK HERE