PGCIL Apprentice Recruitment 2025: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఐటీఐ, డిప్లొమా మరియు గ్రాడ్యుయేషన్ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 962 పోస్టలు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ(పొడిగించబడింది) వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

PGCIL Apprentice Recruitment 2025 Overview
నియామక సంస్థ | పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) |
పోస్టు పేరు | ఐటీఐ, డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ |
ఖాళీల సంఖ్య | 962 |
దరఖాస్తు ప్రక్రియ | 15 సెప్టెంబర్ – 12 అక్టోబర్, 2025 |
జాబ్ లొకేషన్ | దేశంలోని వివిధ రాష్ట్రాల్లో |
Also Read : TGSRTC Driver & Shramik Recruitment 2025 | RTCలో భారీ నోటిఫికేషన్..1,743 పోస్టులు భర్తీ
ఖాళీల వివరాలు :
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ మరియు ఈశాన్య ప్రాంతాలతో సహా వివిధ ప్రాంతాల్లో ఐటీఐ, డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 962 ఖాళీలు ఉన్నాయి.
ప్రాంతం | రాష్ట్రాలు | ఖాళీలు |
నార్త్ రీజియన్-II | జమ్మూ అండ్ కశ్మీర్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, లడఖ్ | 91 |
నార్త్ రీజియన్-III | ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ | 100 |
తూర్పు ప్రాంతం-I | బీహార్, జార్ఖండ్ | 75 |
తూర్పు ప్రాంతం-II | పశ్చిమ బెంగాల్, సిక్కిం | 66 |
ఈశాన్య ప్రాంతం | అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర | 114 |
ఒడిశా ప్రాంతం | ఒడిశా | 57 |
పశ్చిమ ప్రాంతం-I | మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, గోవా | 110 |
పశ్చిమ ప్రాంతం-II | మధ్యప్రదేశ్, గుజరాత్ | 147 |
దక్షిణ ప్రాంతం-I | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక | 86 |
దక్షిణ ప్రాంతం-II | కర్ణాటక, తమిళనాడు, కేరళ | 116 |
అర్హతలు :
PGCIL Apprentice Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి రెగ్యులర్ డిగ్రీ, డిప్లొమా లేదా ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
- ఐటీఐ అప్రెంటిస్ : ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో ఐటీఐ
- డిప్లొమా అప్రెంటిస్ : ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ లేదా ఆఫీస్ మేనేజ్మెంట్ లో డిప్లొమా
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : BE / B.Tech / MBA / MSW / LLB / BA(Hindi) / BMC / BJMC
వయోపరిమితి :
PGCIL Apprentice Recruitment 2025 అభ్యర్థులకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
PGCIL Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
PGCIL Apprentice Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- అకడమిక్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
Also Read : DSSSB Assistant Teacher PRT Recruitment 2025 | సెంట్రల్ ప్రైమరీ టీచర్ ఉద్యోగాలకు బంపర్ నోటిఫికేషన్
జీతం వివరాలు :
PGCIL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ షిప్ సమయంలో ఆకర్షణీయమైన స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
- ఐటీఐ అప్రెంటిస్ : రూ.13,500/-
- డిప్లొమా అప్రెంటిస్ : రూ.15,000/-
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : రూ.17,500/-
దరఖాస్తు విధానం :
PGCIL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్ పోర్టల్ లో రిజిస్ట్రేష్ చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్స్ విభాగానికి వెళ్లాలి – PGCIL Apprentice Recruitment 2025 పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 15 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 12 అక్టోబర్, 2025(పొడిగించబడింది)
ITI Trade Apprentice Registration | Click here |
Diploma & Graduate Apprentice Registration | Click here |
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : Army DG EME Secunderabad Recruitment 2025 | సికింద్రాబాద్ ఆర్మీలో బంపర్ జాబ్స్
3 thoughts on “PGCIL Apprentice Recruitment 2025 | విద్యుత్ సంస్థలో 962 పోస్టులకు నోటిఫికేషన్”