Panjab & Sind Bank Recruitment 2025 పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ / స్కేల్ -1(JMGS-1) లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్(LBO) పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 750 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 20వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
Panjab & Sind Bank LBO Recruitment 2025 Overview
నియామక సంస్థ | పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ |
పోస్టు పేరు | లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (JMGS-1) |
ఖాళీల సంఖ్య | 750 |
దరఖాస్తు ప్రక్రియ | 20 ఆగస్టు – 04 సెప్టెంబర్, 2025 |
వయోపరిమితి | 20 – 30 సంవత్సరాలు |
జాబ్ లొకేషన్ | వివిధ రాష్ట్రాలు |
ఖాళీల వివరాలు :
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 750 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా ఖాళీలు :
రాష్ట్రం | ఖాళీలు |
ఆంధ్రపద్రేశ్ | 80 |
తెలంగాణ | 85 |
ఛత్తీస్ గఢ్ | 40 |
గుజరాత్ | 100 |
హిమాచల్ ప్రదేశ్ | 30 |
జార్ఖండ్ | 35 |
కర్ణాటక | 65 |
మహారాష్ట్ర | 100 |
ఒడిశా | 85 |
పుదుచ్చేరి | 5 |
పంజాబ్ | 60 |
తమిళనాడు | 85 |
అస్సాం | 15 |
మొత్తం | 750 |
అర్హతలు :
Panjab & Sind Bank LBO Recruitment 2025 అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
- అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకు లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్ కేడర్ లో 18 నెలలు లేదా అంతకంటే ఎక్కువ పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
Panjab & Sind Bank LBO Recruitment 2025 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Panjab & Sind Bank LBO Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / EWS / OBC : రూ.850/-
- SC / ST / PWD : రూ.100/-
ఎంపిక ప్రక్రియ :
Panjab & Sind Bank LBO Recruitment 2025 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- పర్సనల్ ఇంటర్వ్యూ
జీతం వివరాలు :
Panjab & Sind Bank LBO Recruitment 2025 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 – రూ.85,920/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
Panjab & Sind Bank LBO Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- హోమ్ పేజీలో రిక్రూట్మెంట్ విభాగంలో నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 20 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 04 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |