OICL AO Recruitment 2025 | ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో భారీ నోటిఫికేషన్ – 300 పోస్టులు

OICL AO Recruitment 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి భారీ నోటిఫికేషన్ వచ్చింది. జనరల్ మరియు స్పెషలిస్ట్ పోస్టులతో సహా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ డిసెంబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

ఖాళీల వివరాలు : 

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • AO(జనరలిస్ట్) : 285
  • AO(హిందీ ఆఫీసర్) : 15

మొత్తం పోస్టుల సంఖ్య : 300

అర్హతలు: 

OICL AO Recruitment 2025 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • AO(జనరలిస్ట్) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ
  • AO(హిందీ ఆఫీసర్) : డిగ్రీలో హిందీని ఒక సబ్జెక్టుగా తీసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీలో హిందీని ఒక సబ్జెక్టుగా తీసుకొని ఇంగ్లీష్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్

Also Read : IMD Recruitment 2025 | వాతావరణ శాఖలో బంపర్ జాబ్స్ – ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు

వయోపరిమితి : 

OICL AO Recruitment 2025 అభ్యర్థులకు 31.12.2025 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

OICL AO Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

  • జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.1,000/-
  • ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ : రూ.250/-

ఎంపిక ప్రక్రియ: 

OICL AO Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • ప్రిలిమ్స్ ఎగ్జామ్
  • మెయిన్స్ ఎగ్జామ్
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఫేజ్–1: ప్రిలిమినరీ పరీక్ష (Prelims Exam Pattern)

(మొత్తం 100 మార్కులు – 1 గంట)

పరీక్ష పేరురకంమార్కులుసమయంభాష
ఇంగ్లీష్ లాంగ్వేజ్ఆబ్జెక్టివ్3020 నిమిషాలుఇంగ్లీష్
రీజనింగ్ అబిలిటీఆబ్జెక్టివ్3520 నిమిషాలుఇంగ్లీష్ / హిందీ
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ఆబ్జెక్టివ్3520 నిమిషాలుఇంగ్లీష్ / హిందీ
మొత్తం10060 నిమిషాలు

ఫేజ్–2: మెయిన్ పరీక్ష (Generalist Officers)

A) ఆబ్జెక్టివ్ టెస్ట్ (200 మార్కులు – 150 నిమిషాలు)

పరీక్ష పేరుప్రశ్నలుమార్కులుసమయంభాష
రీజనింగ్454545 నిమిషాలుఇంగ్లీష్ / హిందీ
ఇంగ్లీష్ లాంగ్వేజ్404030 నిమిషాలుఇంగ్లీష్
జనరల్ అవేర్‌నెస్404020 నిమిషాలుఇంగ్లీష్ / హిందీ
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్404040 నిమిషాలుఇంగ్లీష్ / హిందీ
కంప్యూటర్ నాలెడ్జ్353515 నిమిషాలుఇంగ్లీష్ / హిందీ
మొత్తం200200150 నిమిషాలు

B) డెస్క్రిప్టివ్ టెస్ట్ (30 మార్కులు – 30 నిమిషాలు)

పరీక్షమార్కులుసమయంభాష
ఇంగ్లీష్ Essay & Precis3030 నిమిషాలుఇంగ్లీష్

ఫేజ్–2: మెయిన్ పరీక్ష (Hindi Officers)

ఆబ్జెక్టివ్ టెస్ట్ (200 మార్కులు – 120 నిమిషాలు)

పరీక్ష పేరుప్రశ్నలుమార్కులుసమయంభాష
రీజనింగ్252530 నిమిషాలుఇంగ్లీష్ / హిందీ
ఇంగ్లీష్ లాంగ్వేజ్252520 నిమిషాలుఇంగ్లీష్
ప్రొఫెషనల్ నాలెడ్జ్ (హిందీ)5010050 నిమిషాలుఇంగ్లీష్ / హిందీ
జనరల్ అవేర్‌నెస్252510 నిమిషాలుఇంగ్లీష్ / హిందీ
కంప్యూటర్ నాలెడ్జ్252510 నిమిషాలుఇంగ్లీష్ / హిందీ
మొత్తం150200120 నిమిషాలు

B) డెస్క్రిప్టివ్ టెస్ట్ (50 మార్కులు – 60 నిమిషాలు)

పరీక్షమార్కులుసమయంభాష
Essay (English & Hindi), Letter Writing (Hindi), Translation5060 నిమిషాలుఇంగ్లీష్ / హిందీ

జీతం వివరాలు : 

OICL AO Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు స్కేల్-1 ప్రకారం అన్ని అలవెన్సులు కలుపుకొని నెలకు సుమారు రూ.80,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

OICL AO Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01 డిసెంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేేదీ : 15 డిసెంబర్, 2025

Notification : Click here

Apply Online : Click here

Also Read : UCIL Recruitment 2025 | యూరేనియం కార్పొరేషన్ లో జాబ్స్

2 thoughts on “OICL AO Recruitment 2025 | ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో భారీ నోటిఫికేషన్ – 300 పోస్టులు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!