OFMK Recruitment 2025 ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(AVNL) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్(OFMK) నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ విభాగాల్లో జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్ మరియు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఎంప్లాయ్ మెంట్ న్యూస్ పబ్లికేషన్ నుంచి 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
OFMK Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ |
పోస్టు పేరు | జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్ |
పోస్టుల సంఖ్య | 37 |
దరఖాస్తు విధానం | ఆఫ్ లైన్(పోస్ట్ ద్వారా) |
వయోపరిమితి | 18 – 30 సంవత్సరాలు |
ఎంపిక ప్రక్రియ | మెరిట్ మరియు ఇంటర్వ్యూ |
ఖాళీల వివరాలు
OFMK Recruitment 2025 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ నుంచి వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
జూనియర్ మేనేజర్ (Production, Mechanical, Quality, Civil, IT, Business Analytics, Integrated Material Management) | 21 |
డిప్లొమా టెక్నీషియన్(Tool Design, Design, Quality & Inspection, Mechanical, Civil) | 06 |
అసిస్టెంట్(HR, Stores) | 10 |
విద్యార్హతలు
- Junior Manager – B.E/B.Tech లో ఫస్ట్ క్లాస్ (సంబంధిత విభాగంలో) + కనీసం 1-2 ఏళ్ల అనుభవం.
- Diploma Technician – సంబంధిత విభాగంలో డిప్లొమా + కనీసం 1 సంవత్సరం అనుభవం.
- Assistant (HR/Stores) – ఫస్ట్ క్లాస్ డిగ్రీ + సంబంధిత డిప్లొమా & అనుభవం.
వయస్సు పరిమితి
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు (రిజర్వేషన్ అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది).
అప్లికేషన్ ఫీజు :
OFMK Recruitment 2025 అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు SBI కలెక్ట్ ద్వారా ఆన్ లైన్ లో చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.300/-
- SC/ST/PwBD/Ex-SM/మహిళలకు : ఫీజు మినహాయింపు
జీతం
OFMK Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థులకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
- జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్): ₹30,000/-
- డిప్లొమా టెక్నీషియన్ (కాంట్రాక్ట్): ₹23,000/-
- అసిస్టెంట్ (కాంట్రాక్ట్): ₹23,000/-
- ఇతర అలవెన్సులు, ఇన్స్యూరెన్స్, PF, కాంటీన్ సదుపాయాలు కూడా లభిస్తాయి.
ఎంపిక ప్రక్రియ
OFMK Recruitment 2025 అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- మెరిట్ (విద్యార్హతలో పొందిన మార్కులు) – 75% వెయిటేజ్
- అనుభవం – 10% వెయిటేజ్
- ఇంటర్వ్యూ – 15% వెయిటేజ్
- తుది మెరిట్ లిస్ట్.
దరఖాస్తు విధానం
OFMK Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ సమర్పించుకోవాలి.
- అభ్యర్థులు అప్లికేషన్‌ను ddpdoo.gov.in/career వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- దరఖాస్తును పూర్తి చేసి అవసరమైన సర్టిఫికేట్లతో కలిసి Ordinary/Speed Post ద్వారా కింది చిరునామాకు పంపాలి.
- అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్ : The Deputy General Manager/HR, Ordnance Factory Medak, Yeddumailaram, Sangareddy, Telangana – 502205.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 16-08-2025
- దరఖాస్తు చివరి తేదీ : 21 రోజులు (Employment News లో ప్రచురణ తేదీ నుండి).
Notification & Application | Click here |
Official Website | Click here |