NIT Delhi Non teaching Jobs 2025: దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయాలని ఉన్న అభ్యర్థుల కోసం ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) ఢిల్లీ, నుంచి పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోస నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

NIT Delhi Non teaching Jobs 2025 Overview
నియామక సంస్థ | నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ |
పోస్టు పేర్లు | టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్ |
పోస్టుల సంఖ్య | 14 |
దరఖాస్తు ప్రక్రియ | 1 అక్టోబర్ – 22 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
జాబ్ లొకేషన్ | ఢిల్లీ |
Also Read : EMRS Teaching & Non Teaching Jobs 2025 | ఏకలవ్య స్కూల్స్ లో PGT, TGT & నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్
ఖాళీల వివరాలు:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) ఢిల్లీ, భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ విద్యాసంస్థ. ఇది పార్లమెంట్ చట్టం కింద జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థగా గుర్తింపు పొందింది. ఇటీవల ఈ సంస్థలో నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 14 పోస్టులు ఖాలీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
టెక్నికల్ అసిస్టెంట్ | 2 |
సీనియర్ టెక్నీషియన్ | 1 |
సీనియర్ అసిస్టెంట్ | 1 |
టెక్నీషియన్ | 5 |
జూనియర్ అసిస్టెంట్ | 2 |
ల్యాబ్ అటెండెంట్ | 2 |
ఆఫీస్ అటెండెంట్ | 1 |
అర్హతలు:
NIT Delhi Non teaching Jobs 2025 పోస్టులను బట్టి విద్యార్హతు మారుతాయి. వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
టెక్నికల్ అసిస్టెంట్ :
- సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ తప్పనిసరి.
- విభాగాలు:
- కంప్యూటర్ అప్లికేషన్ / కంప్యూటర్ సైన్స్ / ఐటీ / సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ / డేటా సైన్స్ / వెబ్ డెవలప్మెంట్ / అప్లికేషన్ డెవలప్మెంట్.
- ఏరోస్పేస్ ఇంజినీరింగ్ / ఏరోనాటికల్ ఇంజినీరింగ్ / మెకానికల్ & ఏరోస్పేస్ ఇంజినీరింగ్ / స్పేస్ ఇంజినీరింగ్ / రాకెట్ ప్రొపల్షన్.
సీనియర్ టెక్నీషియన్:
- 10+2 తో పాటు ITI లేదా సంబంధిత ఫీల్డ్‌లో డిప్లొమా.
- పోస్టు: మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో.
సీనియర్ అసిస్టెంట్ :
- కనీసం గ్రాడ్యుయేషన్ (బ్యాచిలర్స్ డిగ్రీ).
- కంప్యూటర్ నాలెడ్జ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
టెక్నీషియన్:
- 10+2 (ఇంటర్) పాస్.
- లేదా ITI / సంబంధిత విభాగంలో డిప్లొమా.
- విభాగాలు: కంప్యూటర్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఏరోస్పేస్.
జూనియర్ అసిస్టెంట్:
- 12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్.
- కంప్యూటర్ అప్లికేషన్లపై ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి.
- టైపింగ్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యం అవసరం.
ల్యాబ్ అటెండెంట్:
- 10వ తరగతి పాస్.
- ల్యాబ్ పనుల్లో సహకరించే నైపుణ్యం ఉండాలి.
ఆఫీస్ అటెండెంట్:
- 10వ తరగతి పాస్.
- ఆఫీస్ సంబంధిత సాధారణ పనులు చేయగలగాలి.
వయోపరిమితి :
NIT Delhi Non teaching Jobs 2025 అభ్యర్థుల వయోపరిమితి పోస్టు ఆధారంగా ఉంటుంది. SC/ST/OBC/PwBD/Ex-Servicemen కు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
- టెక్నికల్ అసిస్టెంట్ : 30 సంవత్సరాలు
- సీనియర్ టెక్నీషియన్ : 33 సంవత్సరాలు
- సీనియర్ అసిస్టెంట్ : 33 సంవత్సరాలు
- టెక్నీషియన్ : 27 సంవత్సరాలు
- జూనియర్ అసిస్టెంట్ : 27 సంవత్సరాలు
- ల్యాబ్ అటెండెంట్ : 27 సంవత్సరాలు
- ఆఫీస్ అటెండెంట్ : 27 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
NIT Delhi Non teaching Jobs 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- UR/OBC/EWS అభ్యర్థులు: ₹1000 + 18% GST
- SC/ST అభ్యర్థులు: ₹500 + 18% GST
- PwBDs / మహిళలు: ఫీజు మినహాయింపు
ఎంపిక ప్రక్రియ:
NIT Delhi Non teaching Jobs 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- స్కిల్ టెస్ట్ / ప్రొఫిషియెన్సీ టెస్ట్
Also Read : VITM Trainee Craft Recruitment 2025 | మ్యూజియంలో ట్రైనీ క్రాఫ్ట్ జాబ్స్
జీతం వివరాలు :
NIT Delhi Non teaching Jobs 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- టెక్నికల్ అసిస్టెంట్ – ₹35,400 – ₹1,12,400/-
- సీనియర్ టెక్నీషియన్ / సీనియర్ అసిస్టెంట్ – ₹25,500 – ₹81,100/-
- టెక్నీషియన్ / జూనియర్ అసిస్టెంట్ – ₹21,700 – ₹69,100/-
- ల్యాబ్ అటెండెంట్ / ఆఫీస్ అటెండెంట్ – ₹18,000 – ₹56,900/-
దరఖాస్తు విధానం :
NIT Delhi Non teaching Jobs 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.nitdelhi.ac.in ని సందర్శించాలి.
- NIT Delhi Non teaching Recruitment లింక్ పై క్లిక్ చేయాలి.
- పేరు, ఈమెయిల్ మరియు మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 1 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 22 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : Indian Coast Guard Civilian Recruitment 2025 | ఇండియన్ కోస్ట్ గార్డ్ MTS, ఫైర్ మ్యాన్ జాబ్స్