NIRDPR Recruitment 2025 : హైదరాబాద్ లో ఉన్న National Institute of Rural Development and Panchayati Raj (NIRDPR) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా డేటా ఎన్యూమిరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్ట్ మరియు రోజు వారీ వేతనం ఆధారంగా ఉంటాయి. మొత్తం 150 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

NIRDPR Recruitment 2025 Overview
నియామక సంస్థ | నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్(NIRDPR) |
పోస్టు పేరు | డేటా ఎన్యూమరేటర్ |
పోస్టుల సంఖ్య | 150 |
దరఖాస్తులకు చివరి తేదీ | 30.09.2025 |
Also Read :CDFD Job Notification 2025 | DNA ఫింగర్ ప్రింట్ లో టెక్నికల్ జాబ్స్
ఖాళీల వివరాలు :
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ సంస్థ గ్రామీణాభివృద్ధి రంగంలో శిక్షణ, పరిశోధన, కన్సల్టెన్సీ సేవలను అందిస్తోంది. ఈ సంస్థ Centre for Geo-Informatics Applications in Rural Development (CGARD) ద్వారా రాజస్థాన్ రాష్ట్రంలోని 38 జిల్లాల్లో జరుగుతున్న 149 Watershed Projects పై మిడ్-టర్మ్ ఈవాల్యుయేషన్ కోసం Data Enumerators నియామకం చేపట్టింది. మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి.
- పోస్టు పేరు : Data Enumerators
- పోస్టుల సంఖ్య : 150
అర్హతలు :
NIRDPR Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
- ఏదైనా విభాగంలో Graduation / Post-Graduation
- English & Hindi లో కమ్యూనికేషన్, రాయగల సామర్థ్యం
- Word & Excel జ్ఞానం
- మొబైల్ ఆపరేషన్స్ అవగాహన
- Data Collection అనుభవం
వయోపరిమితి :
NIRDPR Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 45 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ :
NIRDPR Recruitment 2025 అభ్యర్థులను మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు.
- అభ్యర్థులు పంపిన అప్లికేషన్ల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- ఎంపికైన వారికి మొబైల్/ఇమెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు.
- ఈ నియామకం పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్‌లో మాత్రమే ఉంటుంది
Also Read : APCRDA Latest Jobs 2025 | ఏపీ రాజధాని ప్రాంతంలో భారీగా ఉద్యోగాలు
జీతం వివరాలు :
NIRDPR Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు కన్సాలిడేటెడ్ జీతం ఇవ్వడం జరుగుతుంది.
- గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు : రూ.800/- ప్రతి రోజు
- పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు : రూ.1,000/- ప్రతి రోజు
- ఒక్కో నెలలో గరిష్టంగా 26 రోజులు మాత్రమే పనిచేయవచ్చు.
దరఖాస్తు విధానం :
NIRDPR Recruitment 2025 అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు సమర్పించుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు 1–2 పేజీల CV (పేరు, తండ్రి పేరు, DOB, అడ్రస్, మొబైల్ నెంబర్, డోమిసైల్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్) తయారు చేయాలి.
- అవసరమైన సర్టిఫికేట్లు (10th సర్టిఫికేట్ DOB కోసం, Highest Qualification Marksheet, Aadhar, Bank Account వివరాలు) జతచేయాలి.
- అప్లికేషన్‌ను cgard@nirdpr.org.in ఈ ఇమెయిల్‌కి పంపాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 30.09.2025
Notification | Click here |
Official Website | Click here |
Also Read : NITTTR Non Teaching Recruitment 2025 | టీచర్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో నాన్ టీచింగ్ జాబ్స్