NHAI AI Engineer Recruitment 2025 : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెల్ కింద వివిధ పోస్టల భర్తీ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ ఏఐ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్, అసోసియేట్ ఏఐ ఇంజనీర్, ఫుల్ స్టాక్ ఇంజనీర్, ఏఐ ప్రొడక్ట్ డిజైనర్ మరియు అసోసియేట్ ఏఐ ప్రొడక్ట్ డిజైనర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

NHAI AI Engineer Recruitment 2025 Overview
నియామక సంస్థ | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా |
పోస్టు పేరు | సీనియర్ ఏఐ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్, అసోసియేట్ ఏఐ ఇంజనీర్, ఫుల్ స్టాక్ ఇంజనీర్, ఏఐ ప్రొడక్ట్ డిజైనర్ మరియు అసోసియేట్ ఏఐ ప్రొడక్ట్ డిజైనర్ |
ఖాళీల సంఖ్య | 17 |
దరఖాస్తు ప్రక్రియ | 08 సెప్టెంబర్ – 07 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
Also Read : IB Security Assistant MT Jobs 2025 | ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
రోడ్డు ట్రాన్స్ పోర్ట్ మరియు హైవేస్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న National Highways Authority of India (NHAI) నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) Cell లో వివిధ నిపుణులను (Experts) కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు మూడేళ్ల పాటు (3 Years) కొనసాగుతాయి. అవసరాన్ని బట్టి మరియు పనితీరు బాగుంటే మరిన్ని 2 సంవత్సరాలు పొడిగించబడతాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
సీనియర్ ఏఐ ఇంజనీర్ | 02 |
ఏఐ ఇంజనీర్ | 03 |
అసోసియేట్ ఏఐ ఇంజనీర్ | 05 |
ఫుల్ స్టాక్ ఇంజనీర్ | 02 |
ఏఐ ప్రొడక్ట్ డిజైనర్ | 02 |
అసోసియేట్ ఏఐ ప్రొడక్ట్ డిజైనర్ | 03 |
అర్హతలు :
NHAI AI Engineer Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతల వివరాలు మారుతాయి. వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- Senior AI Engineer : B.Tech/BE/Masters in Science/Engineering/Business/Statistics + కనీసం 5 సంవత్సరాల అనుభవం (AI/ML లో).
- AI Engineer : Graduation (Science/Tech/Engineering/Statistics) + 2 సంవత్సరాల అనుభవం.
- Associate AI Engineer : Final Year Student లేదా Graduation పూర్తయినవారు + Internship / చిన్న Projects అనుభవం.
- Full Stack Engineer : Graduation in Engineering + 3 సంవత్సరాల Web Development అనుభవం.
- AI Product Designer : Bachelor/Master in Design/HCI/Visual Communication + 3 సంవత్సరాల అనుభవం.
- Associate AI Product Designer : Final Year లేదా Graduation పూర్తయినవారు + Internship అనుభవం.
వయోపరిమితి :
NHAI AI Engineer Recruitment 2025 పోస్టులకు నోటిఫికేషన్ లో వయోపరిమితి ప్రత్యేకంగా ఇవ్వలేదు. అయినప్పటికీ NHAI Guidelines for External Professionals ప్రకారం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
NHAI AI Engineer Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
NHAI AI Engineer Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్
- ఇంటర్వ్యూ
జీతం వివరాలు :
NHAI AI Engineer Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతాలు ఉంటాయి.
పోస్టు పేరు | వేతనం (ప్రతి నెలకు) |
సీనియర్ AI ఇంజినీర్ | ₹2,50,000 |
AI ఇంజినీర్ | ₹2,00,000 |
అసోసియేట్ AI ఇంజినీర్ (Internship సమయంలో) | ₹50,000 |
అసోసియేట్ AI ఇంజినీర్ (ఫుల్-టైమ్) | ₹1,50,000 |
ఫుల్ స్టాక్ ఇంజినీర్ | ₹1,75,000 |
AI ప్రొడక్ట్ డిజైనర్ | ₹1,75,000 |
అసోసియేట్ AI ప్రొడక్ట్ డిజైనర్ (Internship సమయంలో) | ₹50,000 |
అసోసియేట్ AI ప్రొడక్ట్ డిజైనర్ (ఫుల్-టైమ్) | ₹1,30,000 |
దరఖాస్తు విధానం :
NHAI AI Engineer Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ www.nhai.gov.in లోకి వెళ్లాలి.
- Careers → Vacancies → AI Cell Recruitment లింక్ ఓపెన్ చేయాలి.
- Online Application Form లో పూర్తి వివరాలు నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ (Certificates, Resume, Photo, Signature) అప్‌లోడ్ చేయాలి.
- Submit చేసి Application ID ను నోట్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 08 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 07 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : Canara Bank Securities Recruitment 2025 | కెనరా బ్యాంకులో భారీ నోటిఫికేషన్