NCL Recruitment 2025 | NCLలో 171 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NLC Recruitment 2025 తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల నియామకాల కోసం ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఓవర్ మ్యాన్, మైనింగ్ సిర్దార్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 171 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15వ తేేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో మే 14వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ప్రస్తుతం దరఖాస్తు గడువు తేదీని జూన్ 4, 2025 వరకు పొడిగించారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. 

NLC Recruitment 2025 

పోస్టుల వివరాలు :  

నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జూనియర్ ఓవర్ మ్యాన్, మైనింగ్ సిర్దార్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 171 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీలు
జూనియర్ ఓవర్ మ్యాన్ (ట్రైనీ)69
మైనింగ్ సిర్దార్ (సెలక్షన్ గ్రేడ్-1)102

అర్హతలు: 

NLC Recruitment 2025 జూనియర్ ఓవర్ మ్యాన్, మైనింగ్ సిర్దార్ పోస్టులకు కింది అర్హతలు ఉండాలి. 

పోస్టు పేరుఅర్హతలు
జూనియర్ ఓవర్ మ్యాన్(ట్రైనీ)మైనింగ్ / మైనింగ్ ఇంజనీరింగ్ లో డిప్లొమా మరియు DGMS ఓవర్ మ్యాన్ సర్టిఫికెట్ + ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్
మైనింగ్ సిర్దార్మైనింగ్ సిర్దార్ సర్టిఫికెట్ లేదా మైనింగ్ లో డిప్లొమా + ఓవర్ మ్యాన్ సర్టిఫికెట్ + ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ తో ఏదైనా సబ్జెక్టులో డిప్లొమా లేదా డిగ్రీ

వయస్సు: 

NLC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు:

పోస్టు పేరు అప్లికేషన్ ఫీజు
జూనియర్ ఓవర్ మ్యాన్UR / EWS / OBC అభ్యర్థులకు రూ.595/- మరియు Sc / ST / ExSm అభ్యర్థులకు రూ.295/- ఫీజు చెల్లించాలి
మైనింగ్ సిర్దార్UR / EWS / OBC అభ్యర్థులకు రూ.486/- మరియు Sc / ST / ExSm అభ్యర్థులకు రూ.236/- ఫీజు చెల్లించాలి

ఎంపిక ప్రక్రియ: 

NLC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

రాత పరీక్ష విధానం

ఎంపిక ప్రక్రియ ముఖ్యంగా రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. రాత పరీక్షలో రెండు పార్ట్ లు ఉంటాయి. పార్ట్ -1 లో 30 మార్కులకు ఉంటుంది. అందులో జనరల్ ఆప్టిట్యూడ్, కాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ పై డిప్లొమా స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. పార్ట్ -2 లో సబ్జెట్ నాలెడ్జ్ పై ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాల సమయం ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ లేదు.  

పరీక్ష విధానం: 

NLC Recruitment 2025 పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-1 మరయు పార్ట్-2 రెండు విభాగాలుగా నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నలకు ఒక మార్కుతో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు. పరీక్ష 1.20 గంటల పాటు నిర్వహిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే పరీక్ష ఉంటుంది. 

  • పార్ట్ -1 లో 30 ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ పై ప్రశ్నలు అడుగుతారు.
  • పార్ట్-2 లో విషయ పరిజ్ణానం మీద 70 ప్రశ్నలు అడుగుతారు. 

జీతం: 

NLC Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతాలు ఉంటాయి.

పోస్టు పేరుజీతం
జూనియర్ ఓవర్ మ్యాన్రూ.31,000 – రూ.1,00,000/-
మైనింగ్ సిర్దార్రూ.26,000 – రూ.1,10,000/-

దరఖాస్తు విధానం: 

NLC Recruitment 2025 పోస్టులకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. 

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ15 – 04 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ04 – 06 – 2025
NOTIFICATIONCLICK HERE
APPLY ONLINECLICK HERE
Official WebsiteCLICK HERE

Leave a Comment

Follow Google News
error: Content is protected !!