Naval Dockyard Apprentice Recruitment 2026 | నేవల్ డాక్‌యార్డ్ విశాఖపట్నం నోటిఫికేషన్ – 320 ఖాళీలు

Naval Dockyard Apprentice Recruitment 2025 : రక్షణ శాఖలో అప్రెంటిస్ ట్రైనింగ్ చేయాలనుకునే ఐటీఐ విద్యార్థులకు ఇదొక మంచి అవకాశం. Naval Dockyard Apprentices School, Visakhapatnam 2026–27 బ్యాచ్ కోసం మొత్తం 320 అప్రెంటిస్ పోస్టులను ప్రకటించింది. ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు ఒక సంవత్సరం ట్రైనింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ నమోదు తర్వాత ఆఫ్‌లైన్ అప్లికేషన్ పంపాలి. 

ఖాళీల వివరాలు

నావల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్, విశాఖపట్నం నుంచి ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  మొత్తం 320 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 

  • Mechanic Diesel – 32
  • Machinist – 12
  • AC Mechanic – 06
  • Foundryman – 03
  • Fitter – 60
  • Pipe Fitter – 30
  • Electrician – 35
  • Instrument Mechanic – 05
  • Electronics Mechanic – 17
  • Welder – 20
  • Sheet Metal Worker – 30
  • Shipwright (Wood) – 30
  • Painter – 15
  • Mechanic Mechatronics – 10
  • COPA – 15

Also Read : SSC GD Constable Recruitment 2026 | భారీగా పోలీస్ ఉద్యోగాలు – 25,487 పోస్టులు

అర్హతలు (Educational Qualifications)

Naval Dockyard Apprentice Recruitment 2025  అభ్యర్థులకు కింది అర్హతలు తప్పనిసరిగా ఉండాలి 

  • SSC / 10వ తరగతి: కనీసం 50% మార్కులు
  • ITI (NCVT/SCVT): కనీసం 65% మార్కులు
  • SSC లేదా ITI లో మార్కులు/గ్రేడ్ లేకుండా ఉన్న సర్టిఫికెట్లు అంగీకరించరు.

వయోపరిమితి (Age Limit)

Naval Dockyard Apprentice Recruitment 2025  అభ్యర్థులకు 

  • కనీస వయసు 14 సంవత్సరాలు
  • హాజర్డస్ ట్రేడ్‌లకు 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సుకు ఎలాంటి పరిమితి లేదు (MSDE ఆదేశాల ప్రకారం)

అప్లికేషన్ ఫీజు

Naval Dockyard Apprentice Recruitment 2025  అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ (Selection Process)

1. షార్ట్‌లిస్టింగ్ (70:30 రేషియో)

  • SSC + ITI మార్కుల ఆధారంగా 70:30 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు   .

2. రాత పరీక్ష

OMR ఆధారిత పరీక్ష – 100 ప్రశ్నలు (2 గంటలు):

  • Maths – 35
  • General Science – 35
  • General Knowledge – 30
  •  నెగటివ్ మార్కులు లేవు.

3. ఫైనల్ మెరిట్ లిస్ట్

  • పరీక్ష మార్కుల ఆధారంగా ట్రేడ్ వారీగా తయారు చేస్తారు.

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్

  • SSC, ITI, Caste, Aadhar, Ex-serviceman సంబంధిత పత్రాలు పరిశీలిస్తారు.

5. మెడికల్ పరీక్ష

  • ఫిట్‌నెస్ నిర్ధారణ తర్వాతే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.

స్టైపెండ్ (Stipend)

Naval Dockyard Apprentice Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹9,600 – ₹10,560 స్టైపెండ్ చెల్లిస్తారు.

పరీక్ష తేదీలు

  • రాత పరీక్ష: 22 మార్చి 2026
  • ఫలితాలు: 25 మార్చి 2026
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్: 30 మార్చి 2026
  • మెడికల్ పరీక్ష: 31 మార్చి 2026 నుంచి

దరఖాస్తు విధానం (How to Apply)

Naval Dockyard Apprentice Recruitment 2025 అభ్యర్థులు ముందుగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఆఫ్ లైన్ లో పంపాలి. 

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 

  • apprenticeshipindia.gov.in లో NAPS పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలి.

ట్రేడ్‌కు అప్లై చేయడం

  • Establishment ID: E08152800002
  • “NAVAL DOCKYARD” ను ఎంచుకుని ట్రేడ్‌కి Apply చేయాలి.

ఆఫ్‌లైన్ అప్లికేషన్ పంపాలి

  • Apprentice profile ప్రింట్
  • 2 హాల్ టికెట్లు
  • SSC, ITI, Caste, Aadhar మొదలైన పత్రాలు
  • స్వీయ ధ్రువీకరించిన పత్రాలు
  • స్వయం చిరునామాతో ₹55 పోస్టల్ స్టాంప్ గల కవర్

అప్లికేషన్ పంపాల్సిన చిరునామా:
The Officer-in-Charge (for Apprenticeship)
Naval Dockyard Apprentices School
VM Naval Base S.O., Visakhapatnam – 530014

చివరి తేదీ: 02 జనవరి 2026 

NotificationClick here
NAPS PortalClick here

Also Read : STPI Recruitment 2025: సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో జాబ్స్

Leave a Comment

Follow Google News
error: Content is protected !!