NABCONS Recruitment 2025 నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(NABARD) యొక్క అనుబంధ సంస్థ అయిన నాబార్డ్ కన్సల్టెన్సనీ సర్వీసెస్(NABCONS) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన చీఫ్ టెక్నికల్ సూపర్ వైజర్ మరియు జూనియర్ టెక్నికల్ సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 63 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
NABCONS Recruitment 2025 Overview
నియామక సంస్థ | నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్(NABCONS) |
పోస్టు పేరు | చీఫ్ టెక్నికల్ సూపర్ వైజర్ మరియు జూనియర్ టెక్నికల్ సూపర్ వైజర్ |
పోస్టుల సంఖ్య | 63 |
జాబ్ లొకేషన్ | దేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు ప్రధాన కార్యాలయం, ముంబై |
దరఖాస్తులకు చివరి తేదీ | 26 ఆగస్టు, 2025 |
ఖాళీల వివరాలు :
నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన చీఫ్ టెక్నికల్ సూపర్ వైజర్ మరియు జూనియర్ టెక్నికల్ సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 63 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
జూనియర్ టెక్నికల్ సూపర్ వైజర్ (సివిల్) | 34 |
జూనియర్ టెక్నికల్ సూపర్ వైజర్ (ఎలక్ట్రికల్) | 27 |
చీఫ్ టెక్నికల్ సూపర్ వైజర్(సివిల్) | 01 |
చీఫ్ టెక్నికల్ సూపర్ వైజర్(సివిల్) | 01 |
మొత్తం | 63 |
అర్హతలు :
NABCONS Recruitment 2025 టెక్నికల్ సూపర్ వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
పోస్టు పేరు | అర్హతలు మరియు అర్హతలు |
జూనియర్ టెక్నికల్ సూపర్ వైజర్(సివిల్) | సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ + 3 సంవత్సరాల అనుభవం |
జూనియర్ టెక్నికల్ సూపర్ వైజర్ (ఎలక్ట్రికల్) | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ + 3 సంవత్సరాల అనుభవం |
చీఫ్ టెక్నికల్ సూపర్ వైజర్(సివిల్) | సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ + 1 సంవత్సరాల అనుభవం |
చీఫ్ టెక్నికల్ సూపర్ వైజర్(ఎలక్ట్రికల్) | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ + 7 సంవత్సరాల అనుభవం |
వయోపరిమితి :
NABCONS Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి వేర్వేరుగా ఉంటుంది.
- జూనియర్ టెక్నికల్ సూపర్ వైజర్లు : 35 సంవత్సరాలు
- చీఫ్ టెక్నికల్ సూపర్ వైజర్లు : 45 సంవత్సరలు
అప్లికేషన్ ఫీజు :
NABCONS Recruitment 2025 టెక్నికల్ సూపర్ వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
NABCONS Recruitment 2025 టెక్నికల్ సూపర్ వైజర్ పోస్టుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- అప్లికేషన్ షార్ట్ లిస్ట్
- ఇంటర్వ్యూ
జీతం వివరాలు :
NABCONS Recruitment 2025 టెక్నికల్ సూపర్ వైజర్ ఉద్యోగాలకు పోస్టును బట్టి కన్సాలిడేటెట్ ఇవ్వడం జరుగుతుంది.
- జూనియర్ టెక్నికల్ సూపర్ వైజర్ : నెలకు రూ.45,000/-
- చీఫ్ టెక్నికల్ సూపర్ వైజర్ : నెలకు రూ.1,15,000/-
దరఖాస్తు విధానం :
NABCONS Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అభ్యర్థులు అప్లయ్ చేసుకునే పోస్టుపై క్లిక్ చేయాలి.
- ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 13 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 26 ఆగస్టు, 2025
Notification | Click here |
Junior Technical Supervisor(Civil) | Click here |
Junior Technical Supervisor(Electrical) | Click here |
Chief Technical Supervisor | Click here |
Official Website | Click here |