MANUU Recruitment 2025: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, డిప్యుటేషన్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

MANUU Recruitment 2025 Overview
నియామక సంస్థ | మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ |
పోస్టు పేరు | నాన్ టీచింగ్ పోస్టులు |
పోస్టుల సంఖ్య | 27 |
దరఖాస్తు ప్రక్రియ | 4 సెప్టెంబర్ – 29 సెప్టెంబర్, 2025 |
హార్డ్ కాపీ చివరి తేదీ | 10 అక్టోబర్, 2025 |
Also Read : KTCB Clerk Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులో క్లర్క్ పోస్టులు
ఖాళీల వివరాలు :
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో మరియు డిప్యుటేషన్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులు
- డిప్యూటీ రిజిస్ట్రార్: 1
- రీజినల్ డైరెక్టర్: 2
- అసిస్టెంట్ రీజినల్ డైరెక్టర్: 8
- సెక్షన్ ఆఫీసర్: 2
- ఇన్‌స్ట్రక్టర్ – పాలిటెక్నిక్ (సివిల్): 1
- అసిస్టెంట్: 1
- కంప్యూటర్ అసిస్టెంట్ (తాత్కాలికం): 1
- లోయర్ డివిజన్ క్లర్క్: 3
- డ్రైవర్: 1
- ల్యాబ్ అటెండెంట్: 3
- మల్టీటాస్కింగ్ స్టాఫ్ (MTS): 1
డిప్యుటేషన్ పోస్టులు
- చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్: 1
- ప్రైవేట్ సెక్రటరీ: 2
అర్హతలు :
MANUU Recruitment 2025 ప్రతి పోస్టుకు వేర్వేరు అర్హతలు అవసరం. కొన్ని పోస్టులకు మాస్టర్స్ డిగ్రీ, మరికొన్నింటికి బ్యాచిలర్ డిగ్రీ, మరికొన్నింటికి ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. పోస్టును బట్టి అనుభవం, టైపింగ్ లేదా కంప్యూటర్ నైపుణ్యాలు కూడా అవసరం.
- డిప్యూటీ రిజిస్ట్రార్: కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీతో పాటు, నిర్దిష్ట అనుభవం ఉండాలి.
- రీజినల్ డైరెక్టర్: 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్‌లో (ODL) కనీసం 10 ఏళ్ల అనుభవం.
- అసిస్టెంట్ రీజినల్ డైరెక్టర్: 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, ODL/టీచింగ్/అడ్మినిస్ట్రేషన్‌లో కనీసం మూడేళ్ల అనుభవం.
- లోయర్ డివిజన్ క్లర్క్: 10+2 లేదా తత్సమాన అర్హత, ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 35 wpm లేదా హిందీ టైపింగ్ స్పీడ్ 30 wpm ఉండాలి.
- డ్రైవర్: 10వ తరగతి పాస్, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, మరియు 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం.
- మల్టీటాస్కింగ్ స్టాఫ్ (MTS): 10వ తరగతి లేదా ఐటీఐ పాస్.
వయోపరిమితి :
MANUU Recruitment 2025 వయోపరిమితి పోస్టును బట్టి మారుతుంది. అభ్యర్థులకు 30 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- SC/ST: 5 సంవత్సరాలు
- OBC: 3 సంవత్సరాలు
- వికలాంగులు (PwBD): 10 సంవత్సరాలు. ఒకవేళ SC/ST అయితే 15 సంవత్సరాలు, OBC అయితే 13 సంవత్సరాలు.
అప్లికేషన్ ఫీజు :
MANUU Recruitment 2025 అప్లికేషన్ ఫీజు పోస్టుల గ్రూపు, అభ్యర్థి కేటగిరీని బట్టి నిర్ణయించబడింది. అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ పద్ధతిలో మాత్రమే చెల్లించాలి.
- గ్రూప్ ‘A’ పోస్టులు:
- జనరల్, EWS, OBC: ₹500
- SC, ST, PwBD, XSM: ₹250
- గ్రూప్ ‘B’ & ‘C’ పోస్టులు:
- జనరల్, EWS, OBC: ₹300
- SC, ST, PwBD, XSM: ₹150
- అన్ని పోస్టులకు మహిళా అభ్యర్థులు: ఫీజు మినహాయింపు
ఎంపిక ప్రక్రియ :
MANUU Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్
- ఇంటర్వ్యూ
- గ్రూప్ ‘B’ & ‘C’ పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు.
Also Read : RCF Kapurthala Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో కొత్త నోటిఫికేషన్
జీతం వివరాలు :
MANUU Recruitment 2025 జీతం పోస్టును బట్టి లెవెల్-1 నుంచి లెవెల్-12 వరకు ఉంటుంది.
- డిప్యూటీ రిజిస్ట్రార్: ₹78,800 – ₹2,09,200 (లెవెల్-12)
- సెక్షన్ ఆఫీసర్: ₹44,900 – ₹1,42,400 (లెవెల్-7)
- అసిస్టెంట్: ₹35,400 – ₹1,12,400 (లెవెల్-6)
- లోయర్ డివిజన్ క్లర్క్: ₹19,900 – ₹63,200 (లెవెల్-2)
- మల్టీటాస్కింగ్ స్టాఫ్ (MTS): ₹18,000 – ₹56,900 (లెవెల్-1)
దరఖాస్తు విధానం :
MANUU Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రెండు దశలు ఉన్నాయి. అభ్యర్థులు ముందుగా ఆన్ లైన్ లో అప్లయ్ చేసి, హార్డ్ కాపీ సమర్పించాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు: ముందుగా, మీరు manuunt.samarth.edu.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూరించాలి.
- హార్డ్ కాపీ సమర్పణ: ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత, దాని ప్రింటెడ్ హార్డ్ కాపీని అన్ని అవసరమైన ధృవపత్రాలు, మార్కుల షీట్లు, అనుభవ ధృవపత్రాలతో పాటు కింద ఇచ్చిన చిరునామాకు చివరి తేదీలోపు పంపించాలి. కవరుపై మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో స్పష్టంగా రాయాలి.
చిరునామా :
- The Assistant Registrar, ER-II Section, Room No.107, Admin Building, Maulana Azad National Urdu University, Gachibowli, Hyderabad- 500 032
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 04.09.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 29.09.2025
- హార్డ్ కాపీ చివరి తేదీ : 10.10.2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : IIT Hyderabad Recruitment 2025 | విద్యాశాఖలో అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్