Kendriya Vidyalaya Recruitment 2025 | తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో జాబ్స్

 Kendriya Vidyalaya Tirumalagiri Recruitment 2025 సికింద్రాబాద్ లోని తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 12, 13వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపికలు జరుగుతాయి. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేేసుకోగలరు. 

Kendriya Vidyalaya Tirumalagiri Recruitment 2025

పోస్టుల వివరాలు :  

సికింద్రాబాద్ లోని తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 

  • పీజీటీ (ఇంగ్లీస్, హిందీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్)
  • పీజీటీ(కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, డాన్స్ టీచర్, యోగా టీచర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, డాక్టర్, నర్స్)

అర్హతలు : 

సికింద్రాబాద్ లోని తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా కోర్సుల్లో బీఈడీతో పాటు పీజీ చదివి ఉండాలి. ఇంగ్లీష్, హిందీ భాషల్లో మంచి నైపుణ్యం ఉండాలి. సీటెట్ లో అర్హత సాధించి ఉండాలి. మిగితా పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: 

Kendriya Vidyalaya Tirumalagiri Recruitment 2025 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ఉండదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచిన అభ్యర్థులకు జాబ్ ఇస్తారు. 

జీతం : 

సికింద్రాబాద్ లోని తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు కేంద్రీ విద్యాలయం నిబంధనల ప్రకారం జీతాలు చెల్లిస్తారు. 

దరఖాస్తు విధానం : 

Kendriya Vidyalaya Tirumalagiri Recruitment 2025 సికింద్రాబాద్ లోని తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ లో ఇచ్చిన అర్హతల సర్టిఫికెట్లతో డైరెక్ట్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. 

ఇంటర్వ్యూ తేదీలు : 

Kendriya Vidyalaya Tirumalagiri Recruitment 2025 సికింద్రాబాద్ లోని తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలకు మార్చి 12, 13వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 

ఇంటర్వ్యూ తేదీపోస్టులు
12 – 03 – 2025పీజీటీ (ఇంగ్లీస్, హిందీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్)
13 – 03 – 2025పీజీటీ(కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, డాన్స్ టీచర్, యోగా టీచర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, డాక్టర్, నర్స్)

ఇంటర్వ్యూ జరిగే చిరునామా : 

కేంద్రీయ విద్యాలయం, 

తిరుమలగిరి,

సికింద్రాబాద్ – 500015

వివరాల కోసం : 

ఏమైనా వివరాల కోసం 040-29805230 నెంబర్ లేదా principalkvt@gmail.com మెయిల్ ను సంప్రదించాలి. 

NotificationCLICK HERE
Notification-2CLICK HERE
Official WebsiteCLICK HERE

Leave a Comment

Follow Google News
error: Content is protected !!