ISRO VSSV Recruitment 2025 : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(VSSV) నుంచి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ / ఇంజనీర్ ‘SC’ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పేలెవల్-10 ప్రకారం జీతాలు ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ISRO VSSV Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఇస్రో, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ |
పోస్టు పేరు | సైంటిస్ట్ / ఇంజనీర్ ‘SC’ |
పోస్టుల సంఖ్య | 17 |
దరఖాస్తు ప్రక్రియ | 22 సెప్టెంబర్ – 06 అక్టోబర్, 2025 |
జాబ్ లొకేషన్ | తిరువనంతపురం, బెంగళూరు, శ్రీహరికోట |
Also Read : DRDO SSPL Recruitment 2025
ఖాళీల వివరాలు :
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి సైంటిస్ట్ / ఇంజనీర్ ‘SC’ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 17 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
పోస్ట్ కోడ్ | విభాగం | ఖాళీలు |
1554 | అప్లైడ్ మెకానిక్స్ / మెషీన్ డిజైన్ | 05 |
1555 | మెటలర్జీ / మెటీరియల్ సైన్స్ | 01 |
1556 | థెర్మల్ ఇంజనీరింగ్ | 01 |
1557 | కంట్రోల్ ఇంజనీరింగ్ / ఇన్ స్ట్రుమెంటేషన్ | 01 |
1558 | కెమికల్ ఇంజనీరింగ్ | 01 |
1559 | నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ | 02 |
1560 | ఇండస్ట్రియల్ సేఫ్టి ఇంజనీరింగ్ | 06 |
అర్హతలు :
ISRO VSSV Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు పోస్టు కోడ్ ని బట్టి విద్యార్హతలు ఉంటాయి. అభ్యర్థులు విద్యార్హతల విభాగాలు నోటిఫికేషన్ లో చూడవచ్చు.
- కనీసం 60 శాతం మార్కులతో ME / M.Tech లేదా CGPA 6.5/10
- కనీసం 65 శాతం మార్కులతో BE / B.Tech లేదా CGPA 6.84/10
- సెక్షన్ బిలో 65 శాతం మార్కులతో AMIE / Grade IETE అభ్యర్థులు
వయోపరిమితి :
ISRO VSSV Recruitment 2025 అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
ISRO VSSV Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ప్రారంభంలో అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.750/- చెల్లించాలి.
- ఎస్సీ / ఎస్టీ / మహిళలు / మాజీ సైనికులు / దివ్యాంగ అభ్యర్థులకు రూ.750/- రీఫండ్ చేయడం జరుగుతుంది.
- అన్ని ఇతర అభ్యర్థులకు రూ.500/- ఫీజు రీఫండ్ చేయడం జరుగుతుంది.
ఎంపిక ప్రక్రియ :
ISRO VSSV Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కింది దశల్లో ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
Also Read : HVF Junior Manager Recruitment 2025
జీతం వివరాలు :
ISRO VSSV Recruitment 2025 సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పేలెవల్-10 ప్రకారం రూ.56,100 – 1,77,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అన్ని అలవెన్సులు కలుపుకొని నెలకు సుమారు రూ.84,000/- వరకు జీతం అందుతుంది.
దరఖాస్తు విధానం :
ISRO VSSV Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు VSSV అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లయ్ పై క్లిక్ చేసి, అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 22 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 06 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : IBPS RRB Notification 2025 | గ్రామీణ బ్యాంకుల్లో 12 వేల పోస్టులు.. అప్లయ్ చేశారా?
4 thoughts on “ISRO VSSV Recruitment 2025 | ఇస్రోలో భారీ జీతంతో సైంటిస్ట్ / ఇంజనీర్ ఉద్యోగాలు”