ISRO IPRC Apprentice 2025 : ISRO Propulsion Complex (IPRC), మహేంద్రగిరి (తిరునెల్వేలి, తమిళనాడు) లో Graduate / Diploma Technician Apprentices కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ISRO యొక్క రాకెట్ ఇంజిన్ అసెంబ్లీ, లిక్విడ్ ప్రొపల్షన్ మరియు క్రయోజెనిక్ టెక్నాలజీ వంటి కీలక విభాగాల్లో ఒక సంవత్సరం ట్రైనింగ్ పొందే అద్భుత అవకాశం ఇది. ముఖ్యంగా 2021 నుండి 2025 మధ్య గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారికి ఇది సరైన అవకాశం. మొత్తం 100 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
ఖాళీల వివరాలు
ISRO Propulsion Complex (IPRC), మహేంద్రగిరి నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు – 100
Graduate Apprentice (Engineering) – 41 Posts
- Mechanical – 12
- Electronics – 10
- Electrical – 5
- Civil – 4
- Instrumentation – 3
- Chemical – 2
- Computer Science – 5
Graduate Apprentice (Non-Engineering) – 15 Posts
- BA – 4
- B.Sc – 7
- B.Com – 4
Technician Apprentice (Diploma) – 44 Posts
- Mechanical – 15
- Electronics – 10
- Electrical – 10
- Civil – 5
- Chemical – 4
Also Read : BARC OCES–DGFS 2026 Notification | BARCలో భారీ నోటిఫికేషన్ – సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు
అర్హతలు
ISRO IPRC Apprentice 2025 అభ్యర్థులకు అప్రెంటిస్ ని బట్టి విద్యార్హతలు మారుతాయి.
Graduate Engineering Apprentice
- B.E/B.Tech – 65% లేదా CGPA 6.84/10
Graduate Non-Engineering Apprentice
- BA / B.Sc / B.Com – కనీసం 60%
Technician Apprentice
- సంబంధిత బ్రాంచ్‌లో Diploma – First Class
అదనపు నిబంధనలు
- డిగ్రీ/డిప్లొమా పూర్తయిన సంవత్సరం: 2021–2025 మాత్రమే అర్హులు
- Part-time / Distance Mode అర్హులు కాదు
- Apprenticeship పూర్తి చేసినవారు / ఒక సంవత్సరం జాబ్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్నవారు అర్హులు కాదు
వయోపరిమితి
ISRO IPRC Apprentice 2025 అభ్యర్థులకు అప్రెంటిస్ షిప్ ని బట్టి వయోపరిమితి మారుతుంది.
- Graduate Apprentice : 28 సంవత్సరాలు
- Technician Apprentice : 35 సంవత్సరాలు
- SC/ST : 5 సంవత్సరాలు సడలింపు
- OBC : 3 సంవత్సరాలు సడలింపు
స్టైపెండ్ వివరాలు
ISRO IPRC Apprentice 2025 అప్రెంటిస్ పోస్టులు ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
- Graduate Apprentice : నెలకు ₹9,000/-
- Technician Apprentice : నెలకు ₹8,000/-
ఎంపిక ప్రక్రియ
ISRO IPRC Apprentice 2025 అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. ఎంపిక పూర్తిగా మార్కుల ఆధారంగా ఉంటుంది.
- Degree/Diploma లో పొందిన హైయెస్ట్ మార్క్స్ ప్రకారం మెరిట్ లిస్ట్
- డాక్యుమెంట్ వేరిఫికేషన్ సమయంలో అసలు సర్టిఫికేట్లు తప్పనిసరి
దరఖాస్తు విధానం
ISRO IPRC Apprentice 2025 ఈ Apprentice రిక్రూట్మెంట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ లేదు. Walk-in Interview ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు కెరీర్ పేజీలో www.iprc.gov.in వెబ్ సైట్ ని సందర్శించాలి.
- IPRC వెబ్‌సైట్ లో Application Form డౌన్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు పూర్తిగా నింపాలి.
- ఫారమ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లను జత చేయాలి.
- నిర్ణయించిన తేదీ & సమయానికి IPRC మహేంద్రగిరి లొకేషన్ కి స్వయంగా వెళ్లాలి.
- Original Documents మరియు Photo ID తప్పనిసరిగా ఉండాలి.
- పోస్టు ద్వారా / కూరియర్ ద్వారా ఫారమ్ పంపితే అంగీకరించరు.
Walk-in ఇంటర్వ్యూ తేదీలు
10 జనవరి 2026
- Engineering Graduates → 9:30 AM – 12:00 PM
- Technician Apprentices → 2:00 PM – 4:00 PM
11 జనవరి 2026
- BA / B.Sc / B.Com → 9:30 AM – 12:00 PM
| Notification | Click here |
| Application Form | Click here |
Also Read : UIIC Apprentice Recruitment 2025 | “UIICలో భారీ నోటిఫికేషన్ ! డిగ్రీ ఉన్న వాళ్లకి గోల్డ్ ఛాన్స్!
1 thought on “ISRO IPRC Apprentice 2025 | ఇస్రోలో అప్రెంటిస్ నోటిఫికేషన్ – 100 ఖాళీలు”