IOCL Non Executive Recruitment 2025 : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. గువాహటి, బరౌనీ, గుజరాత్, హాల్దియా, మథురా, పనిపట్, డిబ్రుగఢ్, బోంగాయ్‌గావ్ మరియు పరడీప్ రిఫైనరీ యూనిట్లలో Junior Engineering Assistant & Junior Quality Control Analyst వంటి పోస్టుల కోసం నియామకాలు జరుగుతున్నాయి. మొత్తం 394 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 20వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.
ఖాళీల వివరాలు :
ఈ రిక్రూట్మెంట్‌లో Junior Engineering Assistant (JEA) మరియు Junior Quality Control Analyst (JQCA) పోస్టులకు విభిన్న రిఫైనరీల్లో నేరుగా నియామకాలు జరుగుతున్నాయి.
- జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ – IV(ప్రొడక్షన్) : 232
- జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ – IV(Power & Utilities) : 37
- జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ – IV(Power & Utilities – O&M) : 22
- జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ – IV(ఎలక్ట్రికల్) : 12
- జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ – IV(మెకానికల్) : 14
- జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ – IV(ఇన్ స్ట్రుమెంటేషన్) : 06
- జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ – IV(ఫైర్ అండ్ సేఫ్టీ) : 51
- జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ – IV : 20
Also Read : RBI Recruitment 2025 | “సాఫ్ట్‌వేర్, డేటా, రిస్క్ అనాలిటిక్స్… RBIలో టాప్ పోస్టులు!”
అర్హతలు :
IOCL Non Executive Recruitment 2025 పోస్టు ఆధారంగా Chemical, Mechanical, Electrical, Instrumentation విభాగాల్లో డిప్లొమా/B.Sc — Maths, Physics, Chemistry ఉత్తీర్ణులై ఉండాలి. Fire & Safety పోస్టులకు — HVD Licence + NFSC (Nagpur) కోర్స్ తప్పనిసరిగా ఉండాలి.
వయపరిమితి :
IOCL Non Executive Recruitment 2025 పోస్టులకు 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC/ST/OBC/PwBD/Ex-Servicemenకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
IOCL Non Executive Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- GEN/EWS/OBC: ₹300
- SC / ST / PwBD / Ex-Servicemen: ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
IOCL Non Executive Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
1. Computer Based Test (CBT)
- 100 ప్రశ్నలు
- 120 నిమిషాల సమయం
- నెగెటివ్ మార్కింగ్ లేదు
- 40% కనీస క్వాలిఫై (SC/ST/PwBD కు 5% రాయితీ)
2. SPPT – Skill / Proficiency / Physical Test
- క్వాలిఫై అయితేనే ఫైనల్ మెరిట్‌లో పరిగణిస్తారు.
3. మెరిట్ లిస్టు తయారీ — రిఫైనరీ యూనిట్ ఆధారంగా
జీతం వివరాలు :
IOCL Non Executive Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Pay Scale: ₹25,000 – ₹1,05,000/-
- HRA, Medical, PF, Gratuity, Incentives, LTC, Insurance, Education Allowance వంటి బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి.
దరఖాస్తు విధానం :
IOCL Non Executive Recruitment 2025 అభ్యర్థులు అధికాారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.iocl.com సందర్శించాలి.
- కెరీర్ విభాగంలో వెళ్లి అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- అప్లికేషన్లు ప్రారంభం : 20 డిసెంబర్, 2025
- చివరి తేదీ : 9 జనవరి 2026
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : DSSSB MTS Recruitment 2025 | 10వ తరగతితోనే ప్రభుత్వ ఉద్యోగం – 714 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!
1 thought on “IOCL Non Executive Recruitment 2025 | ఇండియన్ ఆయిల్ లో భారీ నోటిఫికేషన్ – 394 పోస్టులు”