IOCL Engineer Recruitment 2025 : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఇంజనీర్లు / ఆఫీసర్లు(గ్రేడ్ ఎ) పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.

IOCL Engineer Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) |
పోస్టు పేరు | ఇంజనీర్లు / ఆఫీసర్లు (గ్రేడ్-ఎ) |
పోస్టుల సంఖ్య | ప్రకటించలేదు |
దరఖాస్తు ప్రక్రియ | 05 సెప్టెంబర్ – 21 సెప్టెంబర్, 2025 |
జాబ్ లొకేషన్ | ఆల్ ఇండియా |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
జీతం | రూ.50,000 – రూ.1,60,000/- |
Also Read : BEML Management Trainee Jobs 2025 | రక్షణ మంత్రిత్వ శాఖలో బంపర్ నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
IOCL Engineer Recruitment 2025 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఇంజనీర్లు / ఆఫీసర్లు (గ్రేడ్-ఎ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఖాళీల సంఖ్యను అధికారిక నోటిఫికేషన్ లో వెల్లడించలేదు.
పోస్టు పేరు | విభాగాలు |
ఇంజనీర్లు/ఆఫీసర్లు(గ్రేడ్-ఎ) | కెమికల్ ఇంజనీరింగ్ |
ఇంజనీర్లు/ఆఫీసర్లు(గ్రేడ్-ఎ) | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ |
ఇంజనీర్లు / ఆఫీసర్లు(గ్రేడ్-ఎ) | ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ |
అర్హతలు :
IOCL Engineer Recruitment 2025 అభ్యర్థులు కెమికల్ / ఎలక్ట్రికల్ / ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో BE / B.Tech / తత్సమాన డిగ్రీ. దేశంలోనే అత్యుత్తమ కెరీర్ అవకాశాలలో ఒకటిగా భావించబడుతున్న IOCL ఉద్యోగాలు, మంచి జీతభత్యాలు మరియు భవిష్యత్తుకు భద్రతను అందిస్తాయి.
వయోపరిమితి :
IOCL Engineer Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- జనరల్ / EWS : 26 సంవత్సరాలు
- ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
IOCL Engineer Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- జనరల్ / EWS / ఓబీసీ : రూ.500 + జీఎస్టీ
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
IOCL Engineer Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- గ్రూప్ డిస్కషన్ మరియు గ్రూప్ టాస్క్
- వ్యక్తి గత ఇంటర్వ్యూ
- ఫైనల్ మెరిట్ లిస్ట్
Also Read : TS Meeseva Centers Notification 2025 | కొత్త మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
IOCL Engineer Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000 – రూ.1,60,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులకు సంవత్సరాలనికి రూ.17.7 LPA ప్యాకేజీతో జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం :
IOCL Engineer Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక IOCL వెబ్‌సైట్ www.iocl.com లోకి వెళ్లి Latest Job Openings లోకి వెళ్లాలి.
- అక్కడ ఉన్న Apply Online లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ పేరు, మొబైల్ నెంటర్, ఈమెయిల్ ఐడీ ద్వారా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 05.09.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 21.09.2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : APCOB Intern Recruitment 2025 | జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో బంపర్ జాబ్స్