Indian Institute of Science Recruitment 2025 : భారత దేశంలో ప్రముఖ పరిశోధనా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూరు ఇటీవల సెంట్రల్ యానిమల్ ఫెసిలిటీ (CAF) విభాగంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రాజెక్ట్ అసోసియేట్-I పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బయాలజీ సంబంధిత పీజీ చదివిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా నిలుస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Indian Institute of Science Recruitment 2025 Overview
| నియామక సంస్థ | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) |
| పోస్టుల పేరు | ప్రాజెక్ట్ అసోసియేట్-I |
| ఖాళీల సంఖ్య | 7 |
| దరఖాస్తు ప్రక్రియ | 9 అక్టోబర్ – 30 అక్టోబర్, 2025 |
| జాబ్ లొకేషన్ | బెంగళూరు |
Also Read : BEL Non Executive Recruitment 2025 | BEL హైదరాబాద్ లో బంపర్ జాబ్స్
ఖాళీల వివరాలు :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూరు భారతదేశంలోని అగ్రశ్రేణి పరిశోధనా సంస్థ. 1909లో స్థాపించబడిన ఈ సంస్థ సైన్స్, ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో ప్రపంచస్థాయి పరిశోధనలు చేస్తోంది. ఇక్కడ నాణ్యమైన విద్య, ఆధునిక ల్యాబ్ సదుపాయాలు మరియు ప్రఖ్యాత పరిశోధకులు అందుబాటులో ఉంటారు. ఈ సంస్థ నుంచి ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
- పోస్టు పేరు: Project Associate – I
- మొత్తం పోస్టులు: 07
- వర్గాల వారీగా ఖాళీలు:
- UR – 4, OBC – 1, ST – 1, EWS – 1
అర్హతలు:
Indian Institute of Science Recruitment 2025 అభ్యర్థులు బయాలజీ విభాగంలో M.Sc. ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ల్యాబ్ మైస్ లేదా ర్యాట్స్ హ్యాండ్లింగ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయోపరిమితి :
Indian Institute of Science Recruitment 2025 అభ్యర్థులకు 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధన ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Indian Institute of Science Recruitment 2025 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
Indian Institute of Science Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు రాత పరీక్ష / ఇంటర్వ్యూ (లేదా రెండూ)కి హాజరుకావాలి.
- ఇంటర్వ్యూ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతిలో జరగవచ్చు.
Also Read : IWAI Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో క్లర్క్, సర్వేయర్ జాబ్స్
జీతం వివరాలు:
Indian Institute of Science Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులను ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు.పనితీరు ఆధారంగా ప్రతి సంవత్సరం పొడిగించబడుతుంది.
- ప్రారంభ జీతం: ₹30,000/- నెలకు (Consolidated)
- 2 సంవత్సరాల తరువాత: ₹34,000/- (Project Associate-II గా ప్రమోషన్)
- 4 సంవత్సరాల తరువాత: ₹51,000/- (Senior Project Associate గా ప్రమోషన్)
దరఖాస్తు విధానం :
Indian Institute of Science Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://recruitment.iisc.ac.in/Temporary_Positions/ ని సందర్శించాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 9 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 30 అక్టోబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : BRO Recruitment 2025 | రోడ్స్ ఆర్గనైజేషన్ లో 542 జాబ్స్.. వివరాలు ఇవిగో..
2 thoughts on “Indian Institute of Science Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు”