Indian Army NCC Special Entry Recruitment 2025 | ఇండియన్ ఆర్మీలో NCC స్పెషల్ ఎంట్రీ జాబ్స్

Indian Army NCC Special Entry Recruitment 2025 ఇండియన్ ఆర్మీ NCC స్పెషల్ ఎంట్రీ 58వ బ్యాచ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 76 పోస్టులు ఉన్నాయి. NCC సర్టిఫికెట్ ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 58వ బ్యాచ్ అక్టోబర్ 2025 నుంచి ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేసుకోగలరు.

Indian Army NCC Special Entry Recruitment 2025

పోస్టుల వివరాలు :

NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 58వ బ్యాచ్ కోసం మొత్తం 76 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటిలో 70 పురుషులకు, 06 మహిళలకు కేటాయించారు.

అర్హతలు :

Indian Army NCC Special Entry స్కీమ్ 58వ బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే పెళ్లి కానీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అదే విధంగా NCC ‘C’ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయస్సు :

Indian Army NCC Special Entry స్కీమ్ 58 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులకు 01.07.2025 నాటికి 19 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థులు 02 జూలై 2000 – 01 జూలై 2006 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు ఫీజు :

Indian Army NCC Special Entry పోస్టులకు దరఖాస్తు చేసే అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

జీతం :

Indian Army NCC Special Entry పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.56,100/- నుంచి రూ.1,77,500/- వరకు పే లెవెల్-10 జీతం చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ :

Indian Army NCC Special Entry పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా ఇంటిమేట్ చేస్తారు. అభ్యర్థులు SSB తేదీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన లింక్ క్లిక చేసి నోటిఫికేషన్ చూడండి.

దరఖాస్తు విధానం :

Indian Army NCC Special Entry పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు joinindianarmy.nic.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన లో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

● ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 14 – 02 – 2025

● ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 15 -03 – 2025

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

1 thought on “Indian Army NCC Special Entry Recruitment 2025 | ఇండియన్ ఆర్మీలో NCC స్పెషల్ ఎంట్రీ జాబ్స్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!