Income Tax Sports Quota Recruitment 2026 : క్రీడల్లో ప్రతిభ చూపిన యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే గొప్ప అవకాశం వచ్చింది. Income Tax Department, Mumbai Region స్పోర్ట్స్ కోటా కింద Stenographer Grade-II, Tax Assistant, Multi-Tasking Staff (MTS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఇది Income Tax Department – Mumbai Region నోటిఫికేషన్ అయినప్పటికీ, భారతదేశం మొత్తం నుంచి అర్హత ఉన్న మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అప్లై చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ మాత్రం Mumbai Region పరిధిలోనే ఉంటుంది
ఖాళీల వివరాలు (Vacancy Details)
ఇన్ కమ్ ట్యాక్స్, ముంబై రీజియన్ నుంచి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- Stenographer Grade-II (Steno) – 12 పోస్టులు
- Tax Assistant (TA) – 47 పోస్టులు
- Multi-Tasking Staff (MTS) – 38 పోస్టులు
మొత్తం ఖాళీలు: 97
Also Read : Federal Bank Recruitment 2026 | 10వ తరగతి అర్హతతో బ్యాంక్ ఉద్యోగం
అర్హతలు (Educational Qualification)
Income Tax Sports Quota Recruitment 2026 పోస్టు వారీగా అర్హతలు ఇలా ఉన్నాయి.
- Stenographer Grade-II : 12వ తరగతి లేదా సమాన అర్హత
- Tax Assistant : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (Graduation)
- Multi-Tasking Staff (MTS) : 10వ తరగతి లేదా సమాన అర్హత
- పై అర్హతలతో పాటు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండాలి
- నోటిఫికేషన్‌లో పేర్కొన్న గేమ్స్‌లో రాష్ట్ర / జాతీయ / అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న సర్టిఫికేట్లు అవసరం
వయోపరిమితి (Age Limit)
Income Tax Sports Quota Recruitment 2026 అభ్యర్థులకు 01-01-2026 నాటికి పోస్టును బట్టి కింది అర్హతలు ఉండాలి.
- Stenographer Grade-II: 18 – 27 సంవత్సరాలు
- Tax Assistant: 18 – 27 సంవత్సరాలు
- MTS: 18 – 25 సంవత్సరాలు
- స్పోర్ట్స్ పర్సన్స్‌కు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది
అప్లికేషన్ ఫీజు (Application Fee)
- అప్లికేషన్ ఫీజు: ₹200/-
- ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి
ఎంపిక ప్రక్రియ (Selection Process)
Income Tax Sports Quota Recruitment 2026 ఎంపిక కింది విధంగా జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
- స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
- అవసరమైతే స్కిల్ టెస్ట్ / ట్రయల్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- తుది మెరిట్ లిస్ట్
జీతం వివరాలు (Salary Details)
Income Tax Sports Quota Recruitment 2026 ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ పే మ్యాట్రిక్స్ ప్రకారం జీతం ఉంటుంది.
- Stenographer Grade-II: Level-4 (₹25,500 – ₹81,100)
- Tax Assistant: Level-4 (₹25,500 – ₹81,100)
- MTS: Level-1 (₹18,000 – ₹56,900)
క్రీడా విభాగాలు
- Athletics, Swimming, Badminton, Table Tennis, Chess, Lawn Tennis, Cricket, Basketball, Volleyball, Kabaddi, Football, Billiards, Squash, Yoga Sports, Para Sports, Bodybuilding, Boxing
దరఖాస్తు విధానం (How to Apply)
Income Tax Sports Quota Recruitment 2026 అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- Income Tax Department అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి
- అవసరమైన సర్టిఫికేట్లు (Education + Sports) అప్‌లోడ్ చేయాలి
- ఒక అభ్యర్థి ఒకే అప్లికేషన్‌లో అన్ని పోస్టులకు ప్రిఫరెన్స్ ఇవ్వవచ్చు
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ ప్రారంభం: 07-01-2026
- చివరి తేదీ: 31-01-2026
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : Indian Army SSC Tech Recruitment 2026 | ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు – 350 పోస్టులు | ₹56,100 జీతం