IGI Aviation Services Notification | ఎయిర్ పోర్ట్ లో 1,446 గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలు

IGI Aviation Services Recruitment 2025 ఇందిరా గాంధీ ఇంటర్నెషనల్ ఏవియేషన్ సర్వీసెస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ మరియు లోడర్ల పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1,446 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు  సెప్టెంబర్ 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. 

IGI Aviation Services Recruitment 2025 Overview : 

నియామక సంస్థఇందిరా గాంధీ ఇంటర్నెషనల్ ఏవియేషన్ సర్వీసెస్  (IGI Aviation Services )
పోస్టు పేరుఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ మరియు లోడర్లు
పోస్టుల సంఖ్య1,446
దరఖాస్తు ప్రక్రియ10 జులై – 21 సెప్టెంబర్, 2025
దరఖాస్తు విధానంఆన్ లైన్
అర్హత10వ తరగతి / 12వ తరగతి

పోస్టుల వివరాలు : 

ఇందిరా గాంధీ ఇంటర్నెషనల్ ఏవియేషన్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది విమానయాన రంగంలో శిక్షణ మరియు మ్యాన్ పవర్ అందించే సంస్థ. ఈ సంస్థ నుంచి ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ మరియు లోడర్ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 1,446 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

  • ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ : 1,017
  • లోడర్స్(పురుషులు) : 429

అర్హతలు : 

IGI Aviation Services Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. 

  • ఎయిర్ పోర్ట్  గ్రౌండ్ స్టాఫ్  : 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు పురుషులు మరియు మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. 
  • లోడర్స్ : 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 

వయోపరిమితి: 

IGI Aviation Services Recruitment 2025 పోస్టులను బట్టి అభ్యర్థుల వయోపరిమితి మారుతుంది. 

  • ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ : 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 
  • లోడర్స్ : 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు : 

IGI Aviation Services Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్రూ.350/-
లోడర్స్రూ.250/-
SC / ST / OBC / EWSఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

IGI Aviation Services Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • వ్యక్తిగత ఇంటర్వ్యూ (ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ కి మాత్రమే)

జీతం వివరాలు : 

IGI Aviation Services Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • ఎయిర్ పోర్ట గ్రౌండ్ స్టాఫ్ : రూ.25,000 – రూ.35,000/-
  • లోడర్స్ : రూ.15,000 – రూ.25,000/-

దరఖాస్తు విధానం : 

IGI Aviation Services Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
  • అప్లయ్ ఆన్ లైన్ అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 10 జులై, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 21 సెప్టెంబర్, 2025
NotificationClick here
Apply Online Click here
Official WebsiteClick here

5 thoughts on “IGI Aviation Services Notification | ఎయిర్ పోర్ట్ లో 1,446 గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!