ICSIL Recruitment 2025 ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(ICSIL) నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్, లా గ్రాడ్యుయేట్, మేనేజర్ పోస్టలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఫిబ్రవరి 12వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు.
ICSIL Recruitment 2025
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 55
ఈ రిక్రూట్మెంట్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, లా గ్రాడ్యేయేట్, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 55 పోస్టులు ఉన్నాయి. వాటిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ – 22, లా గ్రాడ్యుయేట్ – 22, మేనేజర్ – 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు : ICSIL Recruitment 2025
డేటా ఎంట్రీ ఆపరేటర్ : ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. దీంతో పాటు టైపింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 1 సంవత్సరం అనుభవం కావాలి.
లా గ్రాడ్యుయేట్ : లా డిగ్రీ మరియు బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి.
మేనేజర్(క్లెయిమ్) : ఈ పోస్టులకు MBA చేేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
NIT Warangal Recruitment 2025 | తెలంగాణలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు
వయస్సు :
ICSIL Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 22 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ఎంపిక విధానం :
ICSIL Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో మెరుగైన ప్రదర్శన ఇచ్చిన అభ్యర్థుల డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
ICSIL Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.23,836/- , లా గ్రాడ్యుయేట్ పోస్టులకు రూ.25,000/-, మేనేజర్ పోస్టులకు రూ.30,000/- జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు :
ICSIL Recruitment 2025 డేటా ఎంట్రీ ఆపరేటర్, లా గ్రాడ్యుయేట్, మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేేసే అభ్యర్థులు అందరూ కూడా రూ.590 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ICSIL Recruitment 2025 ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ICSIL అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ పూర్తి చేసి సమర్పించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 12 -2 – 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
1 thought on “ICSIL Recruitment 2025 | ఇంటెలిజెంట్ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్”