గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్) పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
GRID India Recruitment 2025
పోస్టుల వివరాలు :
గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కేటగిరిల వారీగా పోస్టులు:
కేటగిరి | ఖాళీల సంఖ్య |
జనరల్ | 19 |
EWS | 04 |
OBC | 13 |
SC | 08 |
ST | 03 |
అర్హతలు:
GRID India Recruitment 2025 గ్రిడ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్(పవర్) / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ / పవర్ ఇంజనీరింగ్(ఎలక్ట్రికల్) విభాగంలో BE / B.Tech ఉత్తీర్ణులై ఉండాలి. మరియు 2025 గేట్ లో అర్హత ఉండాలి.
వయస్సు:
GRID India Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
GRID India Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అప్లయ్ చేసుకునే UR / OBC / EWS అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లంచాలి. SC / ST / PWBD అభ్యర్థులకు ఫీజు ఉండదు. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ పద్ధతిలో చెల్లంచాలి.
ఎంపిక ప్రక్రియ:
GRID India Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
జీతం :
GRID India Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/- నుంచి రూ.1,60,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
GRID India Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ పద్ధితిలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు ఆ లింక్ క్లిక్ చేసి ఏప్రిల్ 1వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ | 01 – 04 – 2025 |
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 30 – 04 – 2025 |
Notification | CLICK HERE |
Official Website | CLICK HERE |