సూపర్ ఫుడ్స్.. ఎక్కువ రోజులు బతుకుతారు..!

ఈ రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు చాలా తక్కువనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారు. అంతేకాదు రోగాలతో చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో తినడానికి, పడుకోవడానికి కూడా టైమ్ సరిపోవడం లేదు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేకపోవడంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతోంది. దీంతో రోగాలు త్వరగా వస్తున్నాయి. ఈరోజులలో ఎక్కువ కాలం బతకాలన్నా కష్టంగానే మారింది. అయితే ఈ సూపర్ ఫుడ్స్ మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎక్కువ రోజులు బతికే ఛాన్స్ ఉంది.  ఆ ఫుడ్స్ ఏంటో చూద్దాం.

బాదం:

బాదం గురించి తెలియని వారు ఉండరు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఈ, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలేట్, మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి  పోషకాలు ఉన్నాయి. ప్రతి రోజూ రెండు బాదం పప్పులను తినడం వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

అల్లం:

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలు ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఇన్ఫెక్షన్లు త్వరగా రాకుండా కాపాడుతుంది.  అల్లాన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువ కాలం బ్రతికేందుకు అల్లం హెల్ప్ చేస్తుంది. నిమ్మకాయ:

ఇందులో విటమిన్ సి అనేది అధికంగా లభిస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ సి కూడా చాలా ముఖ్యం. వీలైనంత వరకు నిమ్మకాయను మీ ఆహారంలో చేర్చుకోండి.

వెల్లుల్లి:

వెల్లుల్లి నేరుగా తినేందుకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ మీరు తినే ఇతర ఆహారాలతో పాటు చేర్చుకుని తింటే చాలా మంచిది. తినేవారు పరగడుపున రెండు రెబ్బలను తినడం వల్ల ఫలితాలు ఉంటాయి. 

-పుల్లని పండ్లను కనీసం రోజుకు ఒకటి తినేలా చూసుకోవడం మంచిది. సీజనల్ ఫ్రూట్స్, తాజా పండ్ను రోజూ తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. 

(NOTE: ఈ వివరాలు ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా అందించడం జరిగింది.  ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

Leave a Comment

Follow Google News
error: Content is protected !!