ECIL Technical Officer Recruitment 2025: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో ఒకటైన Electronics Corporation of India Limited (ECIL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 160 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు మొదట 9 నెలల కాంట్రాక్ట్‌కి ఉంటాయి. అవసరాన్ని బట్టి గరిష్టంగా 4 సంవత్సరాల వరకు పొడిగించబడే అవకాశం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.

ECIL Technical Officer Recruitment 2025 Overview
అంశం | వివరాలు |
సంస్థ | Electronics Corporation of India Limited (ECIL) |
పోస్టు పేరు | Technical Officer on Contract |
నోటిఫికేషన్ నం. | 17/2025 |
మొత్తం ఖాళీలు | 160 |
జాబ్ లొకేషన్ | Hyderabad (All India service liability) |
దరఖాస్తు ప్రారంభం | 16.09.2025 (2 PM) |
దరఖాస్తు ముగింపు | 22.09.2025 (2 PM) |
దరఖాస్తు విధానం | Online |
అధికారిక వెబ్‌సైట్ | www.ecil.co.in |
Also Read : IIP Recruitment 2025 | ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ లో ఉద్యోగాలు
ఖాళీల వివరాలు :
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 160 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 160
- UR – 65
- EWS – 16
- OBC – 43
- SC – 24
- ST – 12
అర్హతలు :
ECIL Technical Officer Recruitment 2025 అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఈ / బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- BE/B.Tech లో కనీసం 60% మార్కులు ఉండాలి.
- కనీసం 1 సంవత్సరం అనుభవం (Apprenticeship కూడా కలిపి).
- MS Office బేసిక్ నాలెడ్జ్ తప్పనిసరి
- విభాగాలు:
- ECE / ETC / E&I / Electronics
- EEE / Electrical
- CSE / IT
- Mechanical
- SC/ST అభ్యర్థులకు 50% మార్కులు సరిపోతాయి.
వయోపరిమితి :
ECIL Technical Officer Recruitment 2025 అభ్యర్థులకు 31.08.2025 నాటికి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
ECIL Technical Officer Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ECIL Technical Officer Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
1.షార్ట్ లిస్టింగ్ : B.Tech మార్కుల ఆధారంగా (Ratio 1:4)
2.డాక్యుమెంట్ వెరిఫికేషన్ : Hyderabad లో
3.పర్సనల్ ఇంటర్వ్యూ : ఫైనల్ మెరిట్ లిస్ట్ కింది క్రైటీరియా ఆధారంగా:
- Qualification: 20% weightage
- Work Experience: గరిష్టంగా 30 మార్కులు
- Interview: 50 మార్కులు
Also Read : Andhra Yuva Sankalp 2K25 | వీడియో చేయండి – రూ.లక్ష గెలుచుకోండి
జీతం వివరాలు :
ECIL Technical Officer Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. అదనపు ప్రయోజనాలు కూడా ఉండాలి.
- 1వ సంవత్సరం: ₹25,000/– నెలకు
- 2వ సంవత్సరం: ₹28,000/– నెలకు
- 3వ & 4వ సంవత్సరం: ₹31,000/– నెలకు
దరఖాస్తు విధానం :
ECIL Technical Officer Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్ విభాగంలో జాబ్ ఓపెనింగ్స్ పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 16.09.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 22.09.2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : DRDO ITR Apprentice Recruitment 2025 | గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్
3 thoughts on “ECIL Technical Officer Recruitment 2025 | ఎలక్ట్రానిక్స్ సంస్థలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. ఇప్పుడే అప్లయ్ చేయండి..”