ECIL Technical Officer Recruitment 2025 | ECILలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ECIL Technical Officer Recruitment 2025 ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ మరియు ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 70 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాక్ – ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జులై 21 మరియు 22వ తేదీల్లో నిర్వహిస్తారు. 

ECIL Technical Officer Recruitment 2025 Overview : 

నియామక సంస్థఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)
పోస్టు పేర్లుప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, ఆఫీసర్
పోస్టుల సంఖ్య70
జాబ్ లొకేషన్ఇండియా అంతటా
ఎంపిక పద్ధతివాక్ ఇన్ ఇంటర్వ్యూ
వాక్ ఇన్ తేదీలుజులై 21 మరియు 22, 2025

పోస్టుల వివరాలు : 

ప్రతిష్టాత్మకమైన మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ మరియు ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 70 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భారతదేశంలోని వివిధ జోన్లలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
ప్రాజెక్ట్ ఇంజనీర్08
టెక్నికల్ ఆఫీసర్61
ఆఫీసర్01

అర్హతలు మరియు అనుభవం : 

ECIL Technical Officer Recruitment 2025 వాక్ ఇన్ కు హాజరయ్యే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • ప్రాజెక్ట్ ఇంజనీర్ : కనీసం 60% మార్కులతో BE / B.Tech + 3 సంవత్సరాల అనుభవం
  • టెక్నికల్ ఆఫీసర్ :కనీసం 60% మార్కులతో BE / B.Tech + 1 సంవత్సరం అనుభవం
  • ఆఫీసర్ : BSc (Physics) + 1 సంవత్సరం అనుభవం

 వయస్సు: 

ECIL Technical Officer Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. వయోపరిమితి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • ప్రాజెక్ట్ ఇంజనీర్ : 33 సంవత్సరాలు
  • టెక్నికల్ ఆఫీసర్ / ఆఫీసర్ : 30 సంవత్సరాలు
  • వయోసడలింపు : ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : 

ECIL Technical Officer Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ : 

ECIL Technical Officer Recruitment 2025 పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

  • అర్హత : 20 శాతం వెయిటేజీ
  • అనుభవం : 30 శాతం వెయిటేజీ
  • ఇంటర్వ్యూ : 50 శాతం వెయిటేజీ

జీతం వివరాలు : 

ECIL Technical Officer Recruitment 2025 పోస్టును బట్టి కన్నాలిడేటెడ్ జీతం ఇవ్వబడుతుంది. జీతం వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు

  • 1వ సంవత్సరం : రూ.40,000/-
  • 2వ సంవత్సరం : రూ.45,000/-
  • 3వ సంవత్సరం : రూ.50,000/-
  • 4వ సంవత్సరం : రూ.55,000/-

టెక్నికల్ ఆఫీసర్ / ఆఫీసర్ పోస్టులకు

  • 1వ సంవత్సరం : రూ.25,000/-
  • 2వ సంవత్సరం : రూ.28,000/-
  • 3వ, 4వ సంవత్సరం : రూ.31,000/-

దరఖాస్తు విధానం :

ECIL Technical Officer Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • కెరీర్ విభాగంలో అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ ని జాగ్రత్తగా నింపాలి. 
  • నింపిన అప్లికేషన్ ఫారమ్ ని అవసరమైన పత్రాలు జత చేయాలి. 
  • నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీలో అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. 

కావాల్సిన పత్రాలు : 

  • 10వ తరగతి సర్టిఫికెట్
  • విద్యా సర్టిఫికెట్లు మరియు అన్ని మార్కు షీట్లు
  • అనుభవం సర్టిఫికెట్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ప్రభుత్వ ఐడీ కార్డు (ఆధార్/ పాస్ పోర్ట్)

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు : 

హైదరాబాద్, ముంబై, ఢిల్లీ21 జులై, 2025
కోల్ కతా, గౌహతి, దుర్గాపూర్22 జులై, 2025
రిపోర్టింగ్ సమయంఉదయం 9:00 నుంచి 11.30 గంటల వరకు 

వేదికలు : 

  • హైదరాబాద్ : CLDC, నలంద కాంప్లెక్స్, ECIL పోస్ట్, హైదరాబాద్ 
  • ముంబై : ECIL జోనల్ ఆఫీస్, దాదర్
  • ఢిల్లీ : ECIL జోనల్ ఆఫీస్, నరైనా
  • కోల్ కతా : ECIL జోనల్ ఆఫీస్, పార్క్ స్ట్రీట్
  • గౌహతి మరియు దుర్గాపూర్ : ECIL జోనల్ కార్యాలయాలు
NotificationClick here
Application FormClick here
Official WebsiteClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!