DSSSB Assistant Teacher PRT Recruitment 2025 : ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు(DSSSB) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ టీచర్ PRT పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1180 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇవి సెంట్రల్ టీచర్ పోస్టులు. CTET క్వాలిఫై అయిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఎంపికైన వారు ఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుంది. దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయాలని ఉన్న అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోండి.

DSSSB Assistant Teacher PRT Recruitment 2025 Overview
వివరాలు | సమాచారం |
సంస్థ | Delhi Subordinate Services Selection Board (DSSSB) |
పోస్టు పేరు | Assistant Teacher (Primary) |
మొత్తం ఖాళీలు | 1180 |
వేతన శ్రేణి | ₹35,400 – ₹1,12,400 (Pay Level 6) |
వర్గం | Group B (Non-Ministerial, Non-Gazetted) |
వయోపరిమితి | గరిష్టం 30 సంవత్సరాలు |
దరఖాస్తు ప్రారంభం | 17.09.2025 |
దరఖాస్తు చివరి తేదీ | 16.10.2025 |
వెబ్‌సైట్ | dsssbonline.nic.in |
Also Read : NITTTR Non Teaching Recruitment 2025 | టీచర్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో నాన్ టీచింగ్ జాబ్స్
ఖాళీల వివరాలు :
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి అసిస్టెంట్ టీచర్(ప్రైమరీ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. విద్యా డైరెక్టరేట్ మరియు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1180 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు విభాగం | ఖాళీలు |
డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ | 1055 |
న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ | 125 |
అర్హతలు :
DSSSB Assistant Teacher PRT Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు విద్యార్హతల వివరాలు పరిశీలించుకొని అప్లయ్ చేసుకోగలరు.
డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్:
- Senior Secondary (50% marks) + 2 సంవత్సరాల Diploma in Elementary Education (D.El.Ed.) / B.El.Ed.
- లేదా Graduation + D.El.Ed.
- CTET (Paper-I) తప్పనిసరి.
- 10వ తరగతిలో Hindi/Urdu/Punjabi/English ఏదైనా ఒక భాష పాస్ కావాలి.
న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్:
- 12th pass (50% marks, SC/ST కు 5% రాయితీ) + 2 సంవత్సరాల Diploma in Primary Education / JBT / DIET / B.El.Ed.
- CTET తప్పనిసరి.
- 10వ తరగతిలో Hindi subject పాస్ కావాలి.
All India అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు:
DSSSB Assistant Teacher (Primary) Recruitment 2025 కి కేవలం ఢిల్లీ అభ్యర్థులకే పరిమితం కాదు. ఆల్ ఇండియా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- కానీ వారు D.El.Ed./B.El.Ed./Graduation + CTET Paper-I తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.
- CTET Paper-I సర్టిఫికేట్ CBSE ద్వారా ఇచ్చినది (అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది) కావున, దేశంలోని ఏ రాష్ట్రం నుంచి అయినా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఢిల్లీకి చెందిన అభ్యర్థులకు స్థానిక భాషలో (Hindi/Urdu/Punjabi/English) అర్హత ఉండాలి.
వయోపరిమితి :
DSSSB Assistant Teacher PRT Recruitment 2025 అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
DSSSB Assistant Teacher PRT Recruitment 2025 అభ్యర్థులకు SBI e-pay ద్వారా మాత్రమే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / OBC / EWS : రూ.100/-
- Women, SC, ST, PwBD, Ex-servicemen : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
DSSSB Assistant Teacher PRT Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
పరీక్ష విధానం :
- పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు – 200 మార్కులు – 2 గంటలు.
- Section-A (100 Marks): Reasoning, GK, Maths, English, Hindi
- Section-B (100 Marks): Teaching methodology (NCTE Curriculum)
- Negative Marking: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గింపు.
- కేటగిరీ వారీగా కనీస అర్హత మార్కులు:
- General/EWS : 40%
- OBC : 35%
- SC/ST/PwBD : 30%
Also Read : MANUU Recruitment 2025 | నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
జీతం వివరాలు :
DSSSB Assistant Teacher PRT Recruitment 2025 అసిస్టెట్ టీచర్(ప్రైమరీ) ఉద్యోగాకి ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Pay Scale: ₹35,400 – ₹1,12,400 (Pay Level 6)
- ఇతర అలవెన్సులు (DA, HRA, Medical, Pension Benefits) కూడా లభిస్తాయి.
దరఖాస్తు విధానం :
DSSSB Assistant Teacher PRT Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- DSSSB వెబ్‌సైట్ dsssbonline.nic.in ఓపెన్ చేయాలి.
- “New Registration” చేసి, User ID & Password పొందాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు SBI e-pay ద్వారా చెల్లించాలి.
- Submit చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ :17 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 16 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : IOCL Junior Engineer Recruitment 2025 | రూ.10 లక్షల ప్యాకేజీతో IOCL కొత్త నోటిఫికేషన్