CSL Recruitment 2025 కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. షిప్ డ్రాఫ్ట్స్ మన్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
CSL Recruitment 2025 Overview:
నియామక సంస్థ | కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ |
పోస్టు పేరు | షిప్ డ్రాఫ్ట్స్ మన్ ట్రైనీ |
పోస్టుల సంఖ్య | 35 |
దరఖాస్తు ప్రక్రియ | 02 ఆగస్టు – 22 ఆగస్టు, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
జాబ్ లొకేషన్ | కొచ్చి – కేరళ |
పోస్టుల వివరాలు :
కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి షిప్ డ్రాఫ్ట్స్ మన్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
విభాగాలు | ఖాళీలు |
మెకానికల్ | 20 |
ఎలక్ట్రికల్ | 13 |
ఎలక్ట్రానిక్స్ | 02 |
మొత్తం | 35 |
అర్హతలు :
CSL Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
- SSLC ఉత్తీర్ణత + సంబంధిత విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా
వయస్సు :
CSL Recruitment 2025 అభ్యర్థులకు 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
CSL Recruitment 2025 అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.
- ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు : ఫీజు లేదు
- ఇతర అభ్యర్థులకు : రూ.300/-
ఎంపిక ప్రక్రియ:
CSL Recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- రాత పరీక్ష
- పర్సనల్ ఇంటర్వ్యూ
జీతం వివరాలు :
CSL Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 2 సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ లో స్టైఫండ్ ఇస్తారు.
- మొదటి సంవత్సరం : నెలకు రూ.14,000/- (స్టైఫండ్) – అదనపు పని గంటలకు నెలకు రూ.4,450/-
- రెండవ సంవత్సరం : నెలకు రూ.20,000/- (స్టైఫండ్) – అదనపు పని గంటలకు నెలకు రూ.5,000/-
దరఖాస్తు విధానం :
CSL Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- CSL Ship Draftsman Trainee Recruitment 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ ఆన్ లైన్ / రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 02 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 22 ఆగస్టు, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Rajahmundry airport job gurenchi information kavali sir , Rajahmundry lo untai cheppandi sir koncham research cheyse
Ship trainy