CSIR NGRI Recruitment 2025 హైదరాబాద్ లోని CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ప్రాజెక్ట్ సైంటిస్ట ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అభ్యర్థులు డైరెక్టుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు :
నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు :
CSIR NGRI Recruitment 2025 పోస్టును బట్టి ఐటీఐ / గ్రాడ్యుయేట్స్(బీఎస్సీ) / బీఎస్సీ (నర్సింగ్) / బీపీటీ / ఎంఎస్సీ / ఎంటెక్ / PhD ఉండాలి. వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు తమకు ఉన్న అర్హతల ఆధారంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
వయస్సు :
CSIR NGRI Recruitment 2025 ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
CSIR NGRI Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
CSIR NGRI Recruitment 2025 పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు డైరెక్టుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాలి.
జీతం వివరాలు :
CSIR NGRI Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం వేర్వేరుగా ఉంటుంది.
- ప్రాజెక్ట్ అసిస్టెంట్-I : రూ.18,000 + HRA
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ -II : రూ.20,000 + HRA
- ప్రాజెక్ట్ అసోసియేట్-I : రూ.25,000 – రూ.31,000/- + HRA
- ప్రాజెక్ట్ అసోసియేట్-II : రూ.28,000 – రూ.35,000/- + HRA
- ప్రాజెక్ట్ సైంటిస్ట్- 1 : రూ.56,000/- + HRA
దరఖాస్తు విధానం :
CSIR NGRI Recruitment 2025 ఉద్యోగాలకు సపరేట్ గా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీల్లో అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం తమ దరఖాస్తును అర్హత, అనుభవం మరియు వయస్సుకు సంబంధించిన పత్రాల ధ్రువీకరించిన ఫొటో కాపీలతో వెళ్లాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు :
ఇంటర్వ్యూలు ఆగస్టు 8, 18, 19, 20వ తేదీల్లో జరుగుతాయి. ఆగస్టు 8వ తేదీ ఇంటర్వ్యూ అయిపోంది కాబట్టి.. 18, 19, 20వ తేదీల్లో జరిగే ఇంటర్వ్యూలకు అర్హత ఉన్న అభ్యర్థులు హాజరుకండి.
ఇంటర్వ్యూ వేదిక :
- CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్, ఉప్పల్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ – 500007
Notification | Click here |
Application Form | Click here |