CSIR–CMERI Recruitment 2025 : దేశంలో ప్రముఖ పరిశోధనా సంస్థలలో ఒకటైన CSIR–CMERI, దుర్గాపూర్ మరియు దాని Ludhiana Extension Centre కోసం Technician-I పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ITI పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా దరఖాస్తు చేయవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ 22 డిసెంబర్ 2025 నుంచి ప్రారంభమై, 21 జనవరి 2026 వరకు కొనసాగుతుంది.
ఖాళీల వివరాలు (Vacancy Details)
ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 20 Technician-I పోస్టులు ఉన్నాయి. ప్రతి ట్రేడ్‌కు సంబంధించిన ఖాళీలు ఇలా ఉన్నాయి:
- Fitter – 08 పోస్టులు
- Electrician / Mechanic (Electrical Power Drives) – 05 పోస్టులు
- Electronics Mechanic / Instrument Mechanic – 06 పోస్టులు
- Digital Photography – 01 పోస్టు
Also Read : ISRO IPRC Apprentice 2025 | ఇస్రోలో అప్రెంటిస్ నోటిఫికేషన్ – 100 ఖాళీలు
అర్హతలు (Eligibility)
CSIR–CMERI Recruitment 2025 ప్రతి ట్రేడ్‌కు 10వ తరగతి (SSC) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికెట్ ఉండాలి. (లేదా) 2 సంవత్సరాల Apprenticeship అనుభవం ఉండాలి. లేదా 3 సంవత్సరాల పని అనుభవం (GoI/PSU/Autonomous Body లో) ఉండాలి.
వయోపరిమితి (Age Limit)
CSIR–CMERI Recruitment 2025 అభ్యర్థులకు 21.01.2026 నాటికి 18 నుంచి 28 సంవత్సరాల మద్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు (Application Fee)
CSIR–CMERI Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ పీజు చెల్లించాలి.
- జనరల్/OBC/EWS : రూ.500/-
- SC, ST, Women, PwBD, Ex-servicemen : ఫీజు లేదు
ఎంపిక విధానం (Selection Process)
CSIR–CMERI Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది.
- Trade Test (Qualifying) : ప్రతి ట్రేడ్‌కు వేర్వేరు ప్రాక్టికల్ టెస్టులు ఉంటాయి.
- Competitive Written Exam
పరీక్ష మొత్తం: 150 ప్రశ్నలు – 2 గంటలు 30 నిమిషాలు
Paper–I (1 hour)
- Mental Ability – 50 Questions – No Negative Marking
Paper–II (30 minutes)
- General Awareness – 25 Questions
- English Language – 25 Questions
(Negative Marking: 1 mark)
Paper–III (1 hour)
- Concerned Trade Subject – 50 Questions
(Negative Marking: 1 mark)
జీతం వివరాలు (Salary Details)
CSIR–CMERI Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం అయితే ఇస్తారు.
- Pay Level–2 : ₹19,900 – ₹63,200/-
- నెలకు సుమారు: ₹37,000/- ఉంటుంది.
దరఖాస్తు విధానం (How to Apply)
CSIR–CMERI Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరకాస్తు చేేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: www.cmeri.res.in
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లించిన తర్వాత ఫారం సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభం : 22 డిసెంబర్, 2025
- చివరి తేదీ : 21 జనవరి, 2026
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : BSF Sports Quota Recruitment 2025 | 549 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
1 thought on “CSIR–CMERI Recruitment 2025 | పరిశోధన సంస్థలో టెక్నీషియన్ జాబ్స్”