CSIR CDRI Recruitment 2025 : CSIR – సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(CDRI) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్-1 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ అనేది లక్నోలో ఉన్న ప్రముఖ జాతీయ పరిశోధన సంస్థ. ఇది CSIR ఆధ్వర్యంలో పనిచేస్తూ కొత్త మందులు, బయోమెడికల్ పరిశోధన, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ రంగాల్లో కీలక పరిశోధనలు చేస్తుంది. దేశ ఆరోగ్య రంగ అభివృద్ధికి CDRI ముఖ్యమైన సేవలు అందిస్తోంది. ఇలాంటి సంస్థలో ఉద్యోగం వస్తే మాత్రమే లైఫ్ సెట్ అయినట్లే.

ఖాళీల వివరాలు ::
CSIR – సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(CDRI) నుంచి టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
- టెక్నికల్ అసిస్టెంట్ : 12
- టెక్నీషియన్-1 : 32
Also Read : IMD Recruitment 2025 | వాతావరణ శాఖలో బంపర్ జాబ్స్ – ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
అర్హతలు:
CSIR CDRI Recruitment 2025 పోస్టు ఆధారంగా అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి.
- టెక్నికల్ అసిస్టెంట్ : సంబంధిత రంగంలో డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
- టెక్నీషియన్-1 : 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయోపరిమితి :
CSIR CDRI Recruitment 2025 అభ్యర్థులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
CSIR CDRI Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.500/-
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
CSIR CDRI Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : UCIL Recruitment 2025 | యూరేనియం కార్పొరేషన్ లో జాబ్స్
జీతం వివరాలు :
CSIR CDRI Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- టెక్నికల్ అసిస్టెంట్ : రూ.67,530/-
- టెక్నీషియన్-1 : రూ.36,918/-
దరఖాస్తు విధానం :
CSIR CDRI Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు https://www.cdri.res.in/ వెబ్ సైట్ ని సందర్శించాలి.
- టెక్నికల్ మరియ సపోర్ట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 25 నవంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 26 డిసెంబర్, 2025
Also Read : Prasar Bharati Copy Editor Recruitment 2025 | దూర్ దర్శన్ లో కొత్త నోటిఫికేషన్
2 thoughts on “CSIR CDRI Recruitment 2025 | టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్ పోస్టులు – ఇప్పుడే అప్లై చేయండి”