BOI Officers Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ విభాగాల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 180 ఖాళీలు ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తులు మార్చి 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. మార్చి 23వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. పోస్టులను బట్టి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
BOI Officers Recruitment 2025
పోస్టుల వివరాలు :
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ స్ట్రీమ్స్ లో ఆఫీసర్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 180 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏ స్ట్రీమ్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయనే దానిని నోటిఫికేషన్ లో చూడవచ్చు. ఇక్కడ స్కేల్ ఆధారంగా ఎన్ని పోస్టులు ఉన్నాయో కింద చూడొచ్చు.
స్కేల్ | పోస్టులు |
SMGS IV | 21 |
MMGS III | 85 |
MMGS II | 74 |
అర్హతలు :
BOI Officers Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్ట్రీమ్ లో BE / B.Tech / MCA / MSC / MA / LLB ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని పోస్టులకు అనుభవం కూడా అవసరం ఉంటుంది.
వయస్సు :
BOI Officers Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టులను బట్టి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
పోస్టు పేరు | వయస్సు |
ఐటీ ఆఫీసర్స్ | 28 – 40 సంవత్సరాలు |
ఫిన్ టెక్ ఆఫీసర్స్ | 28 – 37 సంవత్సరాలు |
ఫైనాన్స్ ఆఫీసర్స్ | 28 – 45 సంవత్సరాలు |
లా ఆఫీసర్స్ | 25 – 32 సంవత్సరాలు |
సివిల్ / ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ | 23 – 35 సంవత్సరాలు |
దరఖాస్తు ఫీజు :
BOI Officers Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ, ఇడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850/- మరియు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.175/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్ లైన్ విధానంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
BOI Officers Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రొఫెనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
జీతం :
BOI Officers Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి పే స్కేల్ ఆధారంగా జీతం అందజేస్తారు.
స్కేల్ | జీతం |
SMGS IV | ₹1,02,300 – ₹1,20,940 |
MMGS III | ₹85,920 – ₹1,05,280 |
MMGS II | ₹64,820 – 93,960 |
దరఖాస్తు విధానం :
BOI Officers Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వబడింది.
ముఖ్యమైన తేదీలు :
BOI Officers Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ | 08 – 03 – 2025 |
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 23 – 03 – 2025 |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |
Official Website | CLICK HERE |