BOB Caps Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాపిటల్ మార్కెట్స్ నుంచి బిజినెస డెవలప్మెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 80 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు BOB Caps బిజనెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి 28గా నోటిఫికేషన్ లో వెల్లడించారు. ఈ మెయిల్ ద్వారా రెజ్యూమ్ పంపాల్సి ఉంటుంది.
BOB Caps Recruitment 2025
పోస్టుల వివరాలు :
BOB Caps దేశంలోని చాలా రాష్ట్రాల్లో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టు కోసం నియామకాలు చేపడుతుంది. మొత్తం 80 ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా ఖాళీలను చూస్తే..
- ఆంధ్రప్రదేశ్ – 02
- బీహార్ – 03
- చండీగఢ్ – 2
- గుజరాత్ – 12
- గుర్గావ్ -1
- జూపూర్ – 9
- జార్ఖండ్ – 02
- కర్ణాటక – 09
- లక్నో – 04
- లుథియానా – 2
- మధ్యప్రదేశ్ – 06
- మహారాష్ట్ర – 14
- నోయిడా – 02
- ఉత్తర ఢిల్లీ – 03
- ఒరిస్సా – 1
- తమిళనాడు – 02
- తెలంగాణ – 1
- ఉత్తరప్రదేశ్ – 05
అర్హతలు :
BOB Caps Recruitment 2025 బిజినెస్ డెవలప్మెంట్ డేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ఆర్థిక సేవల అమ్మకాలలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి.
అవసరమైన స్కిల్స్:
● సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్
● కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ స్కిల్స్
● కమ్యునికేషన్ స్కిల్స్
జాబ్ రోల్ :
BOB Caps Recruitment 2025 బిజినెస్ డెవలప్మెంట్ డేనేజర్ పోస్టులకు ఎంకైన అభ్యర్థులు డీమ్యాట్ మరియు ట్రేడింగ్ ఖాతాలను ప్రోత్సహించడం, ఓపెన్ చేయడం బాధ్యతలు నిర్వహించాలి. ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అమ్మడం, కొత్త క్లయింట్లను సంపాదించడం, కస్టమర్ మరియు బ్యాంకు సంబంధాలను కొనసాగించడం, సేల్స్ టార్గెట్స్ చేరుకోవడం బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ కీలక బాధ్యతలు.
దరఖాస్తు విధానం :
BOB Caps Recruitment 2025 బిజినెస్ డెవలప్మెంట్ డేనేజర్ పోస్టులకు అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా అప్ డేట్ రెజ్యూమ్ ను సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకున్న రెజ్యూమ్ ను careers@bobcaps.in కు మెయిల్ చేయాలి. ‘Application for the post of Business Development Manager’ అనే సబ్జెక్ట్ లైన్ ని మాత్రమే ఉపయోగించాలి. మరి ఏ ఇతర సబ్జెక్ట్ లైన్ ని అంగీకరించబడవు.
చివరి తేదీ :
అభ్యర్థుల అప్ డేట్ రెజ్యూమ్ ని ఫిబ్రవరి 28వ తేదీ లోపు పైన పేర్కొన్న మెయిల్ అడ్రస్ కి ఈమెయిల్ చేయాలి.
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
1 thought on “BOB Caps Recruitment 2025| డిగ్రీ అర్హతతో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ జాబ్స్”